కేజీఎఫ్.. చిన్న చిత్రంగా విడుదలై దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంలో నటించిన అనేక మంది నటులు మంచి పేరును సంపాదించుకున్నారు. అయితే, తాజాగా ఈ చిత్రంలో నటించిన ఓ నటుడికి క్యాన్సర్‌గా తేలింది. ఈ సినిమాలో యశ్ పక్కన సహచరుడి పాత్ర పోషించి.. ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగిన హరీశ్ రాయ్ అనే నటుడికి క్యాన్సర్ సోకింది. దీంతో ప్రస్తుతం కిడ్వాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను ఈటీవీ భారత్ సంప్రందించగా.. తాను మొదట థైరాయిడ్‌తో బాధపడుతున్నానని.. పరీక్షలు చేసుకోగా క్యాన్సర్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు.
ప్రస్తుతం క్యాన్సర్‌కు సంబంధించి శస్త్రచికిత్స పూర్తయిందని.. కానీ ఊపిరితిత్తలు సమస్య ఇంకా ఉందని తెలిపారు. చికిత్స కోసం తన వద్ద డబ్బలు లేవని.. తనను ఆర్థికంగా ఆదుకోవాలంటూ ప్రాధేయపడుతున్నారు. ప్రస్తుతానికి తన ఆరోగ్యం కొంత మెరుగుపడిందని హరీశ్ రాయ్ చెప్పారు. అయితే, హరీశ్ వైద్య ఖర్చుల కోసం కన్నడ చిత్ర పరిశ్రమ నటులు, నిర్మాతలు సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: ప్రముఖ దర్శకుడు కన్నుమూత, స్టార్ హీరోల సంతాపం
అదుర్స్ అనిపించేలా ది ఘోస్ట్ ట్రైలర్, ఫుల్ యాక్షన్ మోడ్‌లో నాగార్జున