ETV Bharat / entertainment

నా పెళ్లిలో చాలా పెద్ద గొడవ.. చెప్పులతో గట్టిగా కొట్టుకున్నారు: కత్రిన - కత్రినా కైఫ్​ విక్కీ కౌశల్​ పెళ్లి

బాలీవుడ్​ స్టార్​ హీరో హీరోయిన్లు కత్రినా కైఫ్​, విక్కీ కౌశల్​.. వివాహ వేడుకలో పెద్ద గొడవ జరిగిందంట. చెప్పులతో గట్టిగా కొట్టుకున్నారట. అసలేం జరిగిందంటే?

katrina-kaif-reveals-huge-fight-her-and-vicky-kaushal-wedding

author img

By

Published : Nov 9, 2022, 7:56 PM IST

Katrina Kaif Wedding: బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌, హీరో విక్కీ కౌశల్‌ గతేడాది వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. షూటింగ్‌ గ్యాప్‌ దొరికితే ఇద్దరూ కలిసి ఎంచక్కా విహార యాత్రలకు లేదా డిన్నర్‌ డేట్స్‌కు వెళ్తుంటారు. అలాగే ఇంటర్వ్యూలలో ఒకరి సీక్రెట్స్‌ గురించి మరొకరు చెప్పుకోవడానికి అస్సలు వెనుకాడరు. అయితే ఈసారి కత్రిన ఓ పెద్ద విషయాన్ని ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఆనందంగా సాగిపోతుందనుకున్న తన పెళ్లిలో కొందరు చెప్పులతో కొట్టుకున్నారని వెల్లడించారు.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. 'పెళ్లి పందిట్లో కూర్చున్న నాకు వెనకాల నుంచి గట్టిగట్టిగా అరుపులు వినిపించాయి. ఏంటా? అని వెనక్కు తిరిగి చూస్తే అక్కడ పెద్ద గొడవే జరుగుతోంది. చెప్పులు విసిరేసుకుంటూ కొట్టుకుంటున్నారు. వాళ్లలో నా చెల్లెళ్లు, విక్కీ స్నేహితులు ఉన్నారు. చివరగా ఆ ఫైట్‌లో ఎవరు గెలిచారనేది మాత్రం అడగడమే మర్చిపోయా' అని చెప్పుకొచ్చారు క్యాట్‌. కాగా రెండేళ్ల డేటింగ్‌ అనంతరం గతేడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు విక్కీ, కత్రిన. వీరి సినిమాల విషయానికి వస్తే కత్రినా కైఫ్​ 'టైగర్‌ 3', 'మేరీ క్రిస్‌మస్‌', 'జీలె జరా' సినిమాలు చేస్తున్నారు. విక్కీ.. 'గోవిందా నామ్‌ మేరా', 'సామ్‌ బహదూర్‌' చిత్రాల్లో కనిపించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.