పెళ్లైన తర్వాత ఏమాత్రం ఖాళీ దొరికినా.. భర్త విక్కీ కౌశల్‌తో గడిపేందుకు ఇష్టపడుతోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. తాజాగా విక్కీ-కత్రినా కలిసి నడుస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటోను చూసిన నెటిజన్లు కత్రినా ప్రెగ్నెంట్ అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫొటోలో ఆమె పింక్ చుడిదార్ ధరించి.. బొద్దుగా, పొట్ట ముందుకు వచ్చినట్లు కనిపించింది. దీంతో కత్రినా కైఫ్ కచ్చితంగా గర్భవతి అయ్యిందంటూ.. కన్ఫర్మ్ చేస్తున్నారు నెటిజన్లు.
అయితే ఆ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కావడం వల్ల.. కత్రినా టీమ్ స్పందించింది. కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ కాదని.. ఆ వార్తలు అవాస్తవమని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం విక్కీ-కత్రినా అమెరికా పర్యటనలో ఉన్నారు. న్యూయార్క్‌లో ఉన్న.. హీరోయిన్ ప్రియాంక చోప్రా రెస్టారెంట్‌కు వీరు వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను షేర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది కత్రినా.
గతేడాది డిసెంబర్లో రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో విక్కీ-కత్రినా పెళ్లి జరిగింది. అప్పటి నుంచి ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా ఇద్దరూ.. భర్తతో కలిసి వెకెషన్‌కు వెళ్తోంది కత్రినా. అక్కడి ఆనంద క్షణాలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. విక్కీ కౌశల్ ప్రస్తుతం గోవిందా నామ్ మేరా, లక్ష్మణ్ ఉటెకర్ దర్శకత్వంతో ఓ సినిమా చేస్తున్నాడు. కత్రినా అయితే.. టైగర్-3తో పాటు విజయ్ సేతుపతితో ‘మేరీ క్రిస్టమస్’, జీ లే జరా సినిమాలు చేస్తోంది.
ఇదీ చదవండి: కాంగ్రెస్‌లో 'ఒకే కుటుంబం- ఒకే పదవి' రూల్.. సోనియా, రాహుల్, ప్రియాంక పరిస్థితి?