Karthikeya 2 Movie: యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'కార్తికేయ 2'. పలుమార్లు వాయిదాలు పడిన ఈ మూవీ ఎట్టకేలకు శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా అయితే విడుదలైంది కానీ, ఆశించిన సంఖ్యలో స్క్రీన్లు లభించలేదు. అయితే పరిమిత ధియేటర్లలో విడుదల అయినప్పటికీ మొదటి రోజు మంచి వసూళ్లు సాధించింది.
Karthikeya 2 First Day Collection: 'కార్తికేయ 2' సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 8.50 కోట్ల గ్రాస్ లభించింది. ఖర్చులు తీసేయగా.. రూ.5.05 కోట్ల షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. ఏరియాల వారీగా తెలుగు రాష్ట్రాల్లో 'కార్తికేయ 2' వసూళ్లు చూస్తే..
- నైజాం: రూ.1.24 కోట్లు
- ఉత్తరాంధ్ర: రూ.45 లక్షలు
- సీడెడ్: రూ.40 లక్షలు
- నెల్లూరు: రూ.17 లక్షలు
- గుంటూరు: రూ.44 లక్షలు
- కృష్ణా జిల్లా: రూ.27 లక్షలు
- తూర్పు గోదావరి: రూ.33 లక్షలు
- పశ్చిమ గోదావరి: రూ.20 లక్షలు
తెలుగు రాష్ట్రాల్లో 'కార్తికేయ 2' తొలిరోజు మొత్తం రూ.5.30 కోట్ల గ్రాస్ (రూ. 3.50 కోట్ల షేర్) వసూలు చేసింది. రెస్టాఫ్ ఇండియా, కర్ణాటకలో రూ. 25 లక్షలు రాబట్టింది. ఓవర్సీస్ మార్కెట్‌లో వసూళ్లు రూ.1.30 కోట్లు. తొలి రోజే మూవీ బడ్జెట్లో 25 శాతం రికవరీ చేసినట్లు సమాచారం.
డెరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'కార్తికేయ 2'లో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించారు. ఆదిత్యా మేనన్, తులసి, ప్రవీణ్, సత్య తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాను విడుదల చేశారు మేకర్స్. ఉత్తరాది ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది.
ఇవీ చదవండి: లైట్ గడ్డంతో మహేశ్ బాబు కొత్త లుక్ అదుర్స్