ETV Bharat / entertainment

ఫొటోలో ఉన్న టాలీవుడ్​ హీరోను గుర్తుపట్టగలరా?.. ఈ వారమే భారీ సినిమాతో.. - యంగ్​ హీరో నిఖిల్​ కార్తికేయ 2 అప్డేట్స్​

పైన ఫొటోలో కనపడుతున్న ఈ క్యూట్​ చిన్నోడు.. ప్రస్తుతం టాలీవుడ్​ యాంగ్​ హీరో. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్​లో ముందుకెళ్తున్నాడు. ఈ వారంలో అతడు నటించిన ఓ సినిమా భారీ అంచనాలతో దేశవ్యాప్తంగా విడుదల కానుంది. మరి ఇతడు ఎవరో గుర్తుపట్టగలరా?

actor nikhil
యంగ్ హీరో నిఖిల్​
author img

By

Published : Aug 9, 2022, 10:34 AM IST

ఎలాంటి సినీనేపథ్యం లేకుండా టాలీవుడ్​లో రాణించిన కథానాయకుల జాబితా తిరగేస్తే అందులో ఈ యంగ్​ హీరో పేరు ఉంటుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఇతడు.. కెరీర్​లో ఒడుదొడుకులు ఎదురైనా చక్కని కథల్ని ఎంచుకుంటూ హీరోగా ఎదుగుతున్నాడు. ఈ వారంలో అతడు నటించిన కొత్త సినిమా భారీ అంచనాలతో దేశవ్యాప్తంగా రిలీజ్​ కూడా అవుతోంది. ఈ నేపథ్యంలో అతడికి సంబంధించిన త్రోబ్యాక్​ చిన్ననాటి ఫొటో సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది. కింద కనిపిస్తున్నది ఆ ఫొటోనే. మరి ఇందులో వాళ్ల అమ్మ పక్క కూర్చున్న ఈ క్యూట్​ చిన్నోడు.. ఎవరంటే? యంగ్​ హీరో నిఖిల్​.

Nikhil
హీరో నిఖిల్​

నిఖిల్​.. నటించిన తాజా చిత్రం 'కార్తికేయ 2'. చందూ మొండేటి దర్శకత్వంలో అతడు నటించిన 'కార్తికేయ' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేసిన మరో మిస్టరీ థ్రిల్లరే 'కార్తికేయ2'. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఆగస్టు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ద్వారకలో దాగిన రహస్యం ఏంటి? దాన్ని కార్తికేయ ఎలా కనిపెట్టాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఇక సినిమానే కాకుండా స్పై అనే పాన్​ ఇండియా చిత్రంతోనూ నిఖిల్​ నటిస్తున్నాడు. 'గూఢచారి', 'ఎవరు', 'హిట్'​ వంటి సినిమాలకు ఎడిటర్​గా పనిచేసిన గ్యారీ బీహెచ్​ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ స్పై థ్రిల్లర్ చిత్రంలో యంగ్​ హీరో నిఖిల్​ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఐశ్వర్యా మేనన్​ కథానాయిక. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్​ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో నిఖిల్​ మంచు కొండల్లో ఒంటరిగా నడుస్తూ కనిపించారు. ఆ తర్వాత మంచుతో కప్పేసిన ఓ బాక్స్​ను తెరిచి అందులో ఉన్న తుపాకీలను బుల్లెట్లతో నింపుకుని యాక్షన్ చేస్తూ కనిపించారు. కాగా, శ్రీ చరణ్​ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కె.రాజశేఖర్​రెడ్డి నిర్మిస్తున్నారు. హాలీవుడ్​ టెక్నీషియన్​ జులియన్​ అమరు ఎస్త్రాడా సినిమాటోగ్రాఫర్​గా పనిచేస్తున్నారు.

karthikeya
కార్తికేయ 2

ఇదీ చూడండి: 'సీత'.. ఆ పేరులో ఉన్న మ్యాజిక్కే వేరు.. అన్నీ సూపర్​హిట్టే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.