ETV Bharat / entertainment

సినిమా సూపర్​ హిట్‌.. డైరెక్టర్‌కు ప్రొడ్యూసర్​ కార్​ గిఫ్ట్ - సర్దార్​ సినిమా నిర్మాత దర్శకుడు

కార్తీ నటించిన 'సర్దార్‌' సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుని వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్ర నిర్మాత ఎస్.లక్ష్మణ్ కుమార్ దర్శకుడు పీఎస్ మిత్రన్‌కు కారును బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

sardar
sardar
author img

By

Published : Nov 2, 2022, 9:00 PM IST

తమిళ హీరో అయినా అన్ని భాషల్లో సినీ ప్రియులకు సుపరిచితమైన నటుడు కార్తీ. ఈ ఏడాది ఈ యంగ్‌ హీరో వరుస విజయాలు అందుకుంటూ ఖుషీ అవుతున్నారు. ఇటీవల విడుదలైన 'సర్దార్‌' సినిమా కార్తీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. స్పై థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుని నిర్మాతకు లాభాల పంట పండించింది. దీంతో ఈ సినిమా నిర్మాత ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ దర్శకుడు పీఎస్ మిత్రన్‌కు కారును బహుమతిగా ఇచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కారు తాళాన్ని కార్తీ చేతుల మీదుగా డైరెక్టర్‌కు అందించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

sardar
కారు తాళాన్ని కార్తీ చేతుల మీదుగా డైరెక్టర్‌కు అందించిన ప్రొడ్యూసర్​

ఇక దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా ప్రకటించింది చిత్రబృందం. దానికి 'సర్దార్‌-2'గా టైటిల్‌ను ఖరారు చేసింది. 'సర్దార్‌'కు పని చేసిన బృందమే ఈ రెండో పార్ట్‌లోనూ భాగం కానుందని స్పష్టత ఇచ్చారు. "ఒక్కసారి గూఢచారి అయితే.. ఎప్పుడూ గూఢచారియే" అంటూ సర్దార్‌ కొడుకు పాత్ర రా ఏజెంట్‌గా ఎంపికవ్వడాన్ని ప్రచార చిత్రంలో చూపించారు. కార్తీ సరసన రాశిఖన్నా నటించిన ఈ సినిమాలో చుంకీ పాండే, రజిషా విజయన్, లైలా, మునిష్కాంత్, అశ్విన్ కీలకపాత్రలు పోషించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.