ETV Bharat / entertainment

కార్తి లైనప్​లో భారీ బడ్జెట్ మూవీస్​ - ఇది సాధిస్తే ఓ రేర్​ రికార్డు ఖాయం! - కార్తి ఖాకీ 2 అప్​డేట్​

Karthi Sequel Movies : 'జపాన్​' సినిమా ఫలితాలను దృష్టిలో ఉంచుకుని హీరో కార్తి తన అప్​కమింగ్ మూవీస్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన లైనప్​లో పలు సినిమాలను యాడ్​ చేశారు. ఆ విశేషాలు మీ కోసం..

Karthi Sequel Movies
Karthi Sequel Movies
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 9:14 AM IST

Karthi Sequel Movies : కోలీవుడ్ యంగ్​ హీరో కార్తి ప్రస్తుతం తన అప్​కమింగ్ మూవీస్​పై ఫోకస్​ పెడుతున్నారు. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన 'జపాన్' సినిమా ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేదు. కార్తి నటనకు మార్కులు పడినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్​ వద్ద నిరాశగానే మిగిలింది. దీంతో కార్తి ఫ్యాన్స్​ నిరాశలో ఉన్నారు. కానీ ఇప్పుడున్న ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఆయన వేగం పుంజుకుంటున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆయన లైనప్​లో వరుస చిత్రాలు ఉన్నాయి. ఇటీవ‌లే 'ఖాకీ' సినిమాకు సీక్వెల్​ను అఫీషియల్​గా అనౌన్స్​ చేశారు. ఇక లొకేశ్​ క‌న‌గ‌రాజ్ డైరెక్షన్​లో తెరకెక్కనున్న 'ఖైదీ -2' కోసం కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. అంతే కాకుండా 'స‌ర్దార్' సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారట.

ఇలా మూడు హిట్ సినిమాల‌ సీక్వెల్స్​ను ఒకే ఏడాది పట్టాలెక్కించేలనే ఆలోచనలో కార్తి ఉన్నట్లు సమాచారం. అయితే ఇంత‌కు ముందే 'ఖైదీ-2','ఖాకీ-2' సినిమాలు ఒకేసారి ప్లాన్ చేసిన‌ట్లు టాక్ సాగింది. కానీ ఇప్పుడు ఆ రెండు సినిమాలతో పాటు 'స‌ర్దార్ -2'కూడా సెట్స్​పైకి తెరకెక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇలా కార్తి లైనప్​ నుంచి ఒకేసారి మూడు హిట్ సినిమాల సీక్వెల్స్​ తెరకెక్కించడం ఆస‌క్తిక‌రంగా మారింది.

అయితే వీటిని ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ ఇవ‌న్నీ ఒకే ఏడాది ప‌ట్టాలెక్కిస్తే మాత్రం ఇది ఓ రికార్డు అవుతుంది. ఎందుకంటే ఇంత‌వ‌ర‌కు ఏ హీరో సీక్వెల్స్​ని ఇలా ప్లాన్ చేసింది లేదు. కానీ కార్తి మాత్రం ఒకేసారి రెండు మూడు సినిమా షూట్లను పూర్తి చేసిన రికార్డు ఉంది. దీంతో ఆయనపై నమ్మకం ఉంచుకున్న మేకర్స్​ ఈ సీక్వెల్స్​పై కాన్పిడెంట్​గా ఉన్నారని సమాచారం. ప్ర‌స్తుతం కార్తీ ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారట. అయితే వీట‌న్నింటిని 2024 లోనే ప్లాన్ చేస్తారా లేదా ఇంకో ఏడాది పడుతుందా అన్న విషయం మాత్రం వేచి చూడాల్సిందే.

Japan Movie Story : జపాన్ ముని (కార్తి) ఓ పేరు మోసిన దొంగ‌. దొంగతనానికి ప్లాన్ చేశాడంటే ఇక గురి త‌ప్ప‌దంతే. పోలీసులను కూడా లెక్కజేయకుండా తాను అనుకున్న‌ది కాజేస్తాడు. అయితే ఒక రోజు దొంగతనం చేస్తున్న సమయంలో పోలీసులకు చెందిన కొన్ని సీక్రెట్ వీడియోలు తన చేతికి దొరుకుతాయి. వాటిని త‌న ద‌గ్గ‌రే ఉంచుకున్న జ‌పాన్ పోలీసుల‌కి టార్గెట్‌గా మార‌తాడు. ఎలాగైనా ఆ వీడియోల్ని సొంతం చేసుకుని జ‌పాన్‌, సంగతి తేల్చాలని పోలీస్ అధికారులు శ్రీధ‌ర్ (సునీల్‌), భ‌వాని (విజ‌య్ మిల్ట‌న్‌) రంగంలోకి దిగుతారు.

మ‌రోవైపు క‌ర్ణాట‌క పోలీసులు కూడా జ‌పాన్‌ని వెంబ‌డిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఓ జ్యువెలరీ షాపులోంచి రూ.200 కోట్లు విలువైన న‌గ‌లు దోపిడీకి గుర‌వుతాయి. ఆ దొంగ‌త‌నం జపాన్ చేశాడ‌ని పోలీసుల‌కి ఆధారాలు దొరుకుతాయి. అయినప్పటికీ.. ఓ అమాయ‌కుడు ఆ కేసులో ఇరుక్కుంటాడు. ఇంత‌కీ ఆ దొంగ‌త‌నం ఎవ‌రు చేశారు? జ‌పాన్ దొరికాడా? ఆ అమాయ‌కుడు ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడా? అస‌లు జపాన్ దొంగలా ఎలా మారాడు? సినీ న‌టి సంజు (అను ఇమ్మానుయేల్‌)తో జ‌పాన్‌కి ఏం సంబంధం? వీటి గురించి క్లారిటీ రావాలంటే సినిమా చూడాల్సిందే!

హీరో కార్తీ మాస్​ వార్నింగ్ ​- ఒక్కొక్కరి సీటు కింద బాంబ్ పెడతా!

అనుకోని ఫలితాన్ని అందుకున్న 'జపాన్​' సినిమా - కార్తికి చేదు అనుభవం తప్పదా ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.