ETV Bharat / entertainment

'మీ మాజీ భర్త షాహిద్​ కపూర్​'.. కరీనా షాక్​.. నాలుక్కర్చుకున్న కరణ్‌ - కరీనా షాహిద్​ కపూర్

'కాఫీ విత్​ కరణ్​' షోలో ప్రముఖ నిర్మాత కరణ్​ జోహార్​ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. నటుడు షాహిద్​ కపూర్​ను కరీనా కపూర్​ మాజీ భర్తగా సంబోధించడమే అందుకు కారణం. కరణ్‌ మాజీ భర్త అని సంబోధించగానే.. కరీనా ఒక్కసారి షాకయ్యారు.

shahid kapoor
షాహిద్​ కపూర్
author img

By

Published : Aug 5, 2022, 3:31 PM IST

బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ని నటి కరీనాకపూర్‌ మాజీ భర్తగా సంబోధించి.. వెంటనే నాలుక్కర్చుకున్నారు దర్శకుడు కరణ్‌ జోహార్‌. తన తప్పుని తెలుసుకుని స్టేజ్‌పైనే ఆమెకు క్షమాపణలు చెప్పారు. విశేషమైన ప్రేక్షకాదరణ ఉన్న రియాల్టీ షోలో కరణ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కరీనా షాకయ్యారు. కరణ్‌ వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి. కరణ్‌కి ఏం పనిలేదా? ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి ఎందుకు తలదూరుస్తున్నారంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

'లాల్‌సింగ్‌ చడ్డా' చిత్రాన్ని ప్రమోట్‌ చేసేందుకు కరీనా, ఆమిర్‌ఖాన్‌ తాజాగా కరణ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'కాఫీ విత్‌ కరణ్‌' షోలో పాల్గొని తమ సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా వీరిద్దరి వ్యక్తిగత జీవితాలను తెలుసుకునేందుకు కరణ్‌ ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తనకెంతో ఆప్తమిత్రురాలైన కరీనా గురించి కరణ్‌ చెబుతూ.. "బేబో ఈ షోలో నువ్వు ఇప్పటికే ఎన్నోసార్లు పాల్గొన్నావు. ఎన్నో విశేషాలు పంచుకున్నావు. ఒక నటిగా ఈ స్టేజ్‌పై సందడి చేశావు. నీ భర్త సైఫ్‌తో ఓసారి మెరిశావు. ఇక, మాజీ భర్తతో కూడా.." అంటూ ఏదో చెప్పబోయారు. వెంటనే తన తప్పు తెలుసుకుని... "క్షమించండి. మాజీ భర్త కాదు.. మాజీ ప్రియుడితో ఈ షోకి వచ్చావు. ఇలా ఎన్నోసార్లు ఈ సెట్‌లోకి అడుగుపెట్టావు" అని కరణ్‌ చెప్పుకొచ్చారు.

అయితే, కరణ్‌ మాజీ భర్త అని సంబోధించగానే.. కరీనా ఒక్కసారి షాకయ్యారు. ఇక, ఇదే షోలోని మరో సెగ్మెంట్‌లో "రణ్‌బీర్‌, షాహిద్‌ కపూర్‌.. వీరిద్దరిలో ఎవరు వారి పార్టీకి మిమ్మల్ని ఆహ్వానించరు" అని కరణ్‌ ప్రశ్నించగా.. "రణ్‌బీర్‌ నన్ను ఎందుకు పిలవకుండా ఉంటాడు. నాకు తెలిసినంత వరకూ షాహిద్‌ నన్ను ఆహ్వానించకపోవచ్చు" అని కరీనా జవాబిచ్చారు. ఆమె ఇచ్చిన సమాధానం విని కరణ్‌ నవ్వుకున్నారు. 'జబ్‌ వి మెట్‌' సమయంలో తన తోటి నటుడు షాహిద్‌తో కరీనా ప్రేమలో పడ్డారు. ఆ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. అదే సమయంలో వచ్చిన 'తషాన్‌' కరీనా జీవితాన్నే మార్చేసింది. 'తషాన్‌'లో హీరోగా వర్క్‌ చేసిన సైఫ్‌పై కరీనా ఇష్టం పెంచుకున్నారు. ఆ తర్వాతనే వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

ఇదీ చూడండి : జూనియర్ ఎన్టీఆర్​తో నటించడం నా డ్రీమ్​: జాన్వీ కపూర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.