ETV Bharat / entertainment

మంచు ఫ్యామిలీ మూడో వారసుడు - 'కన్నప్ప' సినిమాతో గ్రాండ్​ ఎంట్రీ - కన్నప్ప మూవీలో అవ్రామ్​

Kannappa Movie Cast : స్టార్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప' మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా ఈ సినిమాలోకి మంచు మూడో తరం వారసుడు సినీ అరంగేట్రం చేయనున్నారు. ఆ విశేషాలు మీ కోసం

Kannappa Movie
Kannappa Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 5:23 PM IST

Updated : Jan 5, 2024, 5:44 PM IST

Kannappa Movie Cast : టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప' మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. స్టార్ నటీనటులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ అప్​డేట్​ను మూవీ మేకర్స్​ వెల్లడించారు. ఈ సినిమా ద్వారా మంచు మూడో తరం వారసుడు సినీ అరంగేట్రం చేయనున్నారు. విష్ణు తనయుడు అవ్రామ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే అవ్రామ్​ రోల్​పై క్లారిటీ ఇవ్వలేదు.

"ఈ సినిమాకు నా జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నా తనయుడు అవ్రామ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించడం నాకు చాలా గర్వకారణం. అవ్రామ్‌తో కలిసి ఈ సినీ జర్నీని ప్రారంభిస్తున్నాను. 'కన్నప్ప' సినిమా ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుంది. ఇది మా కుటుంబంలో ఓ కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఇది కేవలం ఓ చిత్రం మాత్రమే కాదు. ఇది మా కుటుంబం మూడు తరాల కలయికతో వస్తోన్న అరుదైన చిత్రం" అంటూ ట్విట్టర్​ వేదిక విష్ణు ఓ పోస్ట్ షేర్ చేశారు.

కథేంటంటే : 'మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్తకన్నప్ప చరిత్రను ఆదర్శంగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నాం. కన్నప్ప వృత్తాంతం 2వ శతాబ్దంలో జరిగింది, ప్రస్తుతం ఇక్కడి పరిసరాల్లో ఈ సినిమాను చిత్రీకరించడం వీలుకాదు. అందుకోసమనే ఈ చిత్ర నిర్మాణం కోసం ఆర్నెళ్లపాటు న్యూజిలాండ్‌కు వెళ్తున్నాం. కన్నప్ప భక్తిని, ఆయన గొప్పతనాన్నీ నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతోనే ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్​లో రూపొందిస్తున్నాం. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతోనే ఈ సినిమాను సిద్ధం చేస్తున్నాం' అంటూ హీరో విష్ణు ఇదివరకు ఓ సందర్భంలో చెప్పారు.

Kannappa Movie Cast : ఇదిలా ఉండగా.. విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా 'కన్నప్ప' రూపొందుతోంది. ఈ సినిమా ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 'కన్నప్ప' చిత్రం మొత్తాన్ని న్యూజిలాండ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం తయారు చేయించిన ఆర్ట్‌ వర్క్‌ మొత్తాన్ని న్యూజిలాండ్​కు తరలించారు. కాగా భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్‌, లేడీ సూపర్ స్టార్ నయనతార, కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌, మలయాళీ మెగాస్టార్ మోహల్‌ లాల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాకు పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ సినిమాకు రచయితలుగా వ్యవహరిస్తుండగా.. మణిశర్మ, మలయాళ మ్యూజిక్​ డైరెక్టర్​ స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు.

Prabhas Nayanthara : 16ఏళ్ల తర్వాత ప్రభాస్​-నయన్​ జంటగా!.. ఏ సినిమాలో అంటే?

Manchu Vishnu Injured : మంచు విష్ణుకు గాయాలు? 'కన్నప్ప' సినిమా సెట్​లో!

Last Updated : Jan 5, 2024, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.