Kanappa First Poster : టాలీవుడ్ హీరో, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్.. దర్శకత్వం వహిస్తున్నారు. మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. కాగా, గురువారం (నవంబర్ 23) హీరో విష్ణు పుట్టినరోజు సందర్భంగా.. మూవీ నుంచి ఫస్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
-
Step into the world of 𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚 where the journey of an atheist Warrior to becoming Lord Shiva’s ultimate devotee comes to life🏹@kannappamovie @24framesfactory @avaentofficial@ivishnumanchu @themohanbabu @Mohanlal @NimmaShivanna #Prabhas#Kannappa🏹 #HarHarMahadevॐ pic.twitter.com/kRbebbZdbH
— Vishnu Manchu (@iVishnuManchu) November 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Step into the world of 𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚 where the journey of an atheist Warrior to becoming Lord Shiva’s ultimate devotee comes to life🏹@kannappamovie @24framesfactory @avaentofficial@ivishnumanchu @themohanbabu @Mohanlal @NimmaShivanna #Prabhas#Kannappa🏹 #HarHarMahadevॐ pic.twitter.com/kRbebbZdbH
— Vishnu Manchu (@iVishnuManchu) November 22, 2023Step into the world of 𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚 where the journey of an atheist Warrior to becoming Lord Shiva’s ultimate devotee comes to life🏹@kannappamovie @24framesfactory @avaentofficial@ivishnumanchu @themohanbabu @Mohanlal @NimmaShivanna #Prabhas#Kannappa🏹 #HarHarMahadevॐ pic.twitter.com/kRbebbZdbH
— Vishnu Manchu (@iVishnuManchu) November 22, 2023
ఇక కన్నప్ప సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల న్యూజిలాండ్‌లో ఓ కీలక షెడ్యూల్లో యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. హీరో విష్ణు కలల ప్రాజెక్ట్ కావడం వల్ల.. ఎక్కడ కూడా రాజీ పడకుండా నిర్మాత మోహన్ బాబు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ సినిమాకు రచయితలుగా వ్యవహరిస్తుండగా.. మణిశర్మ, మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు.
ప్రభాస్ - నయనతార! అయితే ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరూ శివపార్వతులుగా స్ర్కీన్‌పై కనిపించనున్నట్లు టాక్. వీరితోపాటు సినిమాలో.. కన్నడ హీరో శివరాజ్‌కుమార్, మలయాళీ మెగాస్టార్ మోహల్, శరత్ కుమార్ తదితరులు నటించనున్నారు. అయితే బాలీవుడ్ బ్యూటీ నపూర్ సనన్ ఈ సినిమాలో నటించాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
కథేంటంటే : 'మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్తకన్నప్ప చరిత్రను ఆదర్శంగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నాం. కన్నప్ప వృత్తాంతం 2వ శతాబ్దంలో జరిగింది, ప్రస్తుతం ఇక్కడి పరిసరాల్లో సినిమా తీయడం వీలుకాదు. అందుకోసం ఈ చిత్రం నిర్మాణానికి ఆర్నెళ్లపాటు న్యూజిలాండ్‌కు వెళ్తున్నాం. కన్నప్ప భక్తిని, ఆయన గొప్పతనాన్నీ నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతో పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. భారీ బడ్జెట్‌తో... అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సిద్ధం చేస్తున్నాం' అని హీరో విష్ణు ఇదివరకు ఓ సందర్భంలో చెప్పారు.
Manchu Vishnu Injured : మంచు విష్ణుకు గాయాలు? 'కన్నప్ప' సినిమా సెట్లో!
Prabhas Nayanthara : 16ఏళ్ల తర్వాత ప్రభాస్-నయన్ జంటగా!.. ఏ సినిమాలో అంటే?