ETV Bharat / entertainment

కంగన కొత్త చిత్రం.. యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్నీ తానై.. - కంగనా రనౌత్ వార్తలు

Kangana Ranaut news: స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రకటించారు. సినిమాలో తాను లీడ్ రోల్ పోషించనున్నట్లు చెప్పారు. సొంత బ్యానర్​లో చిత్రాన్ని నిర్మిస్తానని తెలిపారు.

Kangana Ranaut news
Kangana Ranaut news
author img

By

Published : Mar 31, 2022, 4:09 PM IST

Kangana Ranaut news: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు తెరతీశారు. అన్నీ తానై ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిపారు. అందులో లీడ్​ రోల్ పోషించడమే కాకుండా దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నట్లు చెప్పారు. స్వీయ దర్శకత్వంలో ఒక కొత్త సినిమాను రూపొందించనున్నట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థతో చెప్పారు కంగన. తన మణికర్ణిక ఫిల్మ్స్ బ్యానర్​లో సినిమాను స్వయంగా నిర్మిస్తానని చెప్పారు.

Kangana Ranaut direction: కంగనకు దర్శకత్వం కొత్తేం కాదు. 2019లో వచ్చిన 'మణికర్ణిక' సినిమాకు కో-డైరెక్టర్​గా పనిచేశారు. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్.. ఆ సినిమాకు దర్శకత్వం వహించారు. ఝాన్సీ రాణి లక్ష్మీభాయి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆ చిత్రం.. ప్రేక్షకుల మనసులను దోచుకుంది. కత్తి పట్టి కంగన చేసిన విన్యాసాలు అలరించాయి. ఈ క్రమంలో గతేడాదే 'మణికర్ణిక ఫిల్మ్స్' పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్​ను ప్రారంభించారు కంగన. తొలి ప్రాజెక్టులో భాగంగా 'టికు వెడ్స్ షేరు' సినిమాను నిర్మించారు. నవాజుద్దీన్ సిద్దిఖీ, అవ్నీత్ కౌర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా.. ఈ ఏడాది విడుదలకు సిద్ధంగా ఉంది. 'ఎమర్జెన్సీ', మణికర్ణిక రిటర్న్స్ వంటి సినిమాలు ఆమె నిర్మించనున్నారు. ప్రస్తుతం ధాకడ్, తేజస్, 'ది ఇన్​కార్నేషన్: సీత' అనే సినిమాల్లో నటిస్తున్నారు కంగన.

ఇదీ చదవండి: 'నేను హిందీ హీరోని.. తెలుగు చిత్రాల్లో నటించను'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.