ETV Bharat / entertainment

'విక్రమ్'​ ట్రైలర్​లో కమల్​ ఉగ్రరూపం.. అతడి కోసం సాయి పల్లవి - Lakshmi Manchu

Vikram Movie Trailer: యూనివర్సల్​ స్టార్​ కమల్‌ హాసన్‌ హీరోగా నటించిన 'విక్రమ్‌' చిత్ర ట్రైలర్ విడుదలైంది. విజయ్‌సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌.. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్​లో ఈ ముగ్గురి నటన, డైలాగ్స్​ ఆకట్టుకుంటున్నాయి.

kamal haasan vikram movie trailer
Sai Pallavi
author img

By

Published : May 15, 2022, 8:36 PM IST

Vikram Movie Trailer: కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు లోకేష్‌ కనగరాజన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'విక్రమ్‌'. విజయ్‌సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ముగ్గురు హీరోల లుక్స్‌, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందినట్టు, కమల్‌హాసన్‌ 'రా' ఏజెంట్‌గా కనిపించనున్నట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. సన్నివేశానికి తగ్గట్టు అనిరుధ్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 'ఖైదీ', 'మాస్టర్‌' చిత్రాల తర్వాత లోకేష్‌ దర్శకత్వం వహించిన సినిమా కావడం, ముగ్గురు విలక్షణ నటులు కలిసి నటించడంతో 'విక్రమ్‌'పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ట్రైలర్‌ ఆ అంచనాలను ఇంకాస్త పెంచేలా ఉంది. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో సూర్య అతిథిగా కనిపిస్తారని సమాచారం.

సాయి పల్లవి చేతుల మీదుగా..: కన్నడ నటుడు రక్షిత్ శెట్టి నటించిన '777 చార్లీ' చిత్ర ట్రైలర్​ను హీరో వెంకటేశ్​, సాయి పల్లవి, మంచు లక్ష్మి.. సోమవారం మధ్యాహ్నం 12.12 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు సినిమాను తెలుగులో విడుదల చేయనున్న సురేశ్ ప్రొడక్షన్స్​ ప్రకటించింది. దీనిని రానా సమర్పిస్తున్నారు.

ఇదీ చూడండి: కమల్​ హాసన్​ 'విక్రమ్'​ @125కోట్లు.. రిలీజ్​కు ముందే రికార్డు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.