Kamal Haasan And Rajinikanth Friendship : సూపర్ స్టార్ రజనీకాంత్ - యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మధ్య మంచి స్నేహబంధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తమ మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ కమల్‌హాసన్ కొన్ని కామెంట్స్ చేశారు. ప్రతిష్టాత్మక సైమా అవార్డుల(Siima awards 2023) వేదికపై ఆయన రజనీకాంత్ గురించి మాట్లాడారు. విక్రమ్ చిత్రానికి గానూ ఈ ఏడాది బెస్ట్ యాక్టర్‌గా సైమా అవార్డు ముద్దాడారు కమల్ హాసన్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయన తన విక్రమ్ మూవీ డైరెక్టర్, తన అభిమాని అయిన లోకేశ్ కనగరాజ్‌ను ప్రశంసించారు. అనంతరం లోకేశ్ - రజనీకాంత్ కాంబోలో రానున్న సినిమా గురించి కూడా రియాక్ట్ అయ్యారు. "లోకేశ్ కనగరాజ్ నాకు వీరాభిమాని. రీసెంట్గా అతడు నా ఫ్రెండ్ రజనీ కాంత్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. దీనిపై చాలా మంది రకారకాలుగా మాట్లాడారు. 'రజనీకాంత్‌తో మీ ఫ్యాన్స్ సినిమా చేయడం ఏంటి? అని అన్నారు. సాధారణ ప్రేక్షకులకు అది మాత్రమే తెలుసు. కానీ వారిద్దరూ కలిసి సినిమా చేయడాన్ని నేనెంతో గర్విస్తున్నాను. దాదాపు 15 ఏళ్ల క్రితం కమల్ 50 అనే ప్రోగ్రామ్‌లో మా స్నేహబంధం గురించి మాట్లాడాను. రజనీకాంత్ - కమల్‌హాసన్ లాంటి స్నేహితులు ఆతరంలోనే ఎవరూ లేరు. మా మధ్య కూడా పోటీ ఉండేది. కానీ, అది ద్వేషంతో కాదు. ఎంతో ఆరోగ్యకరంగా ఉండేది. అందుకే మేం ఈ స్థాయికి చేరుకున్నాం" అని కమల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Kamal Haasan Mani Ratnam Movie : అలానే ప్రముఖ దర్శకుడు మణిరత్నంతో చేయనున్న సినిమా గురించి కూడా కమల్‌హాసన్ మాట్లాడారు. "నాయగన్ చిత్రం కోసం ఎలా అయితే ప్రశాంతంగా పని చేశామో దీని కోసం కూడా అలాగే పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆడియెన్స్‌ను వినోదాన్ని అందించడమే మా లక్ష్యం. ఆ దిశగానే వెళ్తున్నాం. ఈ చిత్రం కోసం నేను గడ్డం పెంచుకుంటున్నాను" అని కమల్ అన్నారు.
-
The vocals of @ikamalhaasan in Vikram (Pathala Pathala) will not be forgotten anytime soon. The legend has been recognized at SIIMA as the Best Playback Singer - Male (Tamil)! Congratulations, Sir!#NEXASIIMA #DanubeProperties #A23Rummy #HonerSignatis #Flipkart #ParleHideAndSeek… pic.twitter.com/safw1QZ471
— SIIMA (@siima) September 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The vocals of @ikamalhaasan in Vikram (Pathala Pathala) will not be forgotten anytime soon. The legend has been recognized at SIIMA as the Best Playback Singer - Male (Tamil)! Congratulations, Sir!#NEXASIIMA #DanubeProperties #A23Rummy #HonerSignatis #Flipkart #ParleHideAndSeek… pic.twitter.com/safw1QZ471
— SIIMA (@siima) September 17, 2023The vocals of @ikamalhaasan in Vikram (Pathala Pathala) will not be forgotten anytime soon. The legend has been recognized at SIIMA as the Best Playback Singer - Male (Tamil)! Congratulations, Sir!#NEXASIIMA #DanubeProperties #A23Rummy #HonerSignatis #Flipkart #ParleHideAndSeek… pic.twitter.com/safw1QZ471
— SIIMA (@siima) September 17, 2023