ETV Bharat / entertainment

'దేవర' అప్​డేట్​పై కల్యాణ్​ రామ్​ కామెంట్స్​ - 'తప్పు జరిగితే మీరు ఊరుకుంటారా?' - దేవర మూవీ లేటెస్ట్ అప్​డేట్

Kalyan Ram Devil Trailer Release : నందమూరి కల్యాణ్​ రామ్ లీడ్ రోల్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'డెవిల్'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మూవీ ట్రైలర్​ను మేకర్స్​ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జరిగిన ఓ ఈవెంట్​లో కల్యాణ్​ రామ్​ కీలక వ్యాఖ్యలు చేశారు.

Kalyan Ram Devil Trailer Release
Kalyan Ram Devil Trailer Release
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 7:24 PM IST

Kalyan Ram Devil Trailer : నందమూరి కల్యాణ్​ రామ్ లీడ్ రోల్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'డెవిల్'. బ్రిటీష్ కాలం నాటి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్​గా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. ఆద్యంతం యాక్షన్​తో కూడిన ఈ ట్రైలర్​ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతూ వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక హైదరాబాద్​ వేదికగా ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్​ గ్రాండ్​గా జరిగింది. ఇందులో మూవీ టీమ్ పాల్గొని సందడి చేసింది. అయితే హీరో కల్యాణ్​ రామ్​ తన మూవీతో పాటు దేవర మూవీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

"కథ బాగున్న చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని 'బింబిసార' సమయంలోనే నేను చెప్పాను. దాన్ని మీరందరూ కూడా నిజం చేశారు. 'డెవిల్‌' కూడా ఓ మంచి కథ, కథనం, విజువల్స్‌తో కూడిన సినిమా. దీన్ని కూడా ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఫ్యాన్స్​ కోరుకునే అన్ని హంగులు ఈ సినిమాలో ఉన్నాయి. ట్రైలర్‌ చూసి కొంతమంది ఇది నా 'వన్‌మ్యాన్‌ షో' అని అంటున్నారు. కానీ ఏ చిత్రమైనా సమృష్టి కృషితో రూపొందుతుందే తప్ప ఒక్కరి వల్ల కాదు" అని పేర్కొన్నారు.

మరోవైపు తన సోదరుడు జూనియర్ ఎన్​టీఆర్ లీడ్​ రోల్​లో వస్తున్న'దేవర' సినిమా గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "తమ్ముడు తన సినిమా గురించి అప్‌డేట్స్‌ చెప్పొద్దన్నాడు. కానీ, నేను మాత్రం ఓ మాట చెప్పాలనుకుంటున్నా. 'ఆర్‌ఆర్‌ఆర్‌'లాంటి సినిమా చేసిన తర్వాత నటులు,డైరెక్టర్లు, నిర్మాతలకు తదుపరి చిత్రాల విషయంలో ఎక్కువ బాధ్యత ఉంటుంది. కథ, విజువల్స్‌ ఇలా ఎందులోనైనా ఒకవేళ తప్పులు జరిగితే మీరు (అభిమానులు) ఊరుకుంటారా? మేం తెలిసి తప్పు చేయం. కానీ బాధ్యతగా తీసుకుని మిమ్మల్ని అలరించేందుకు ఎంతో కష్టపడతాం. త్వరలో గ్లింప్స్‌ రాబోతుంది. సంబంధిత పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. 'దేవర'తో మీకో కొత్త ప్రపంచాన్ని చూపించనున్నాం. మేమంతా చర్చించుకుని మరీ ఈ గ్లింప్స్​ విడుదల తేదీ త్వరలోనే ప్రకటిస్తాం. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి" అని కల్యాణ్​ రామ్ అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇంట్రెస్టింగ్​గా కల్యాణ్​ రామ్​ 'డెవిల్' గ్లింప్స్​.. 'గూఢ‌చారి అంటే ఇలానే ఉండాలా'

ఎన్టీఆర్​-కల్యాణ్​ రామ్​ కాంబోలో బ్లాక్ బాస్టర్ మూవీ మిస్​.. ఇది వచ్చుంటేనా బాక్సాఫీస్ బద్దలే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.