ETV Bharat / entertainment

'బింబిసార' కొత్త ట్రైలర్‌.. కల్యాణ్​ రామ్​ అదరగొట్టేశాడుగా - హీరో కల్యాణ్‌ రామ్​ బింబిసార

Kalyan Ram Bimbisara new trailer: నందమూరి హీరో కల్యాణ్‌ రామ్​ నటించిన 'బింబిసార' కొత్త ట్రైలర్​ వచ్చేసింది. యుద్ధ విన్యాసాలు, పవర్‌ఫుల్‌ సంభాషణలు, విజువల్స్‌తో ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆసక్తిగా సాగింది.

Bimbisara new trailer
బింబిసార కొత్త ట్రైలర్​
author img

By

Published : Jul 27, 2022, 5:34 PM IST

Kalyan Ram Bimbisara new trailer: నందమూరి హీరో కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం 'బింబిసార'. వశిష్ఠ.. దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, పాటలను పంచుకోగా ఇప్పుడు 'రిలీజ్‌ ట్రైలర్‌'తో మరో ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ను ప్రముఖ నటుడు, కల్యాణ్‌ రామ్‌ సోదరుడు ఎన్టీఆర్‌ సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు.

త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడితో పాటు కల్యాణ్‌ రామ్‌ పోషించిన మరో పాత్రను ఇందులో చూడొచ్చు. యుద్ధ విన్యాసాలు, పవర్‌ఫుల్‌ సంభాషణలు, విజువల్స్‌తో ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్‌ చిత్రంలో కేథరిన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. హైదరాబాద్‌లో ఈ నెల 29న నిర్వహించనున్న 'బింబిసార' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా రానున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఏజ్ 52.. ఫస్ట్ మూవీ బడ్జెట్ రూ.60కోట్లు.. ఎవరీ 'లెజెండ్ శరవణన్'?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.