ETV Bharat / entertainment

ట్యాగ్ మార్చుకున్న 'దేవర' - జూనియర్ ఎన్టీఆర్​ కొత్త పేరేంటో తెలుసా? - ఎన్టీఆర్ ట్యాగ్​లైన్

Jr Ntr Tag Name : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్. యంగ్ టైగర్ ట్యాగ్​ లైన్ మారిపోయింది. తాజాగా విడుదలైన దేవర గ్లింప్స్​ చూస్తే ఇది అర్థమవుతుంది. స్క్రీన్​పై పవర్ ఫుల్ ట్యాగ్​ను వేశారు. మరి ఇంతకీ ఆ ట్యాగ్ ఏంటి తెలుసుకుందాం...

ట్యాగ్ మార్చుకున్న 'దేవర' - జూనియర్ ఎన్టీఆర్​ కొత్త పేరేంటో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 9:37 AM IST

Updated : Jan 9, 2024, 10:04 AM IST

Jr Ntr Tag Name : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దేవర'. 'ఆర్ఆర్ఆర్' లాంటి భారీ పాన్ ఇండియా హిట్ తర్వాత దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ అండ్ సబ్జెక్ట్​లో తారక్​ నటిస్తుండటం వల్ల చిత్రంపై భారీ ఆశలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఎన్టీఆర్​ ఈ సినిమాతో తన యంగ్ టైగర్​ ట్యాగ్​ లైన్​ను మార్చుకున్నారు.

వివరాల్లోకి వెళితే. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత దర్శకుడు కొరటాల శివ - ఈ దేవరను డైరెక్ట్​ చేస్తున్నారు. ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా దేవర మూవీ గ్లింప్స్‌(Devara Glimpse) రిలీజ్​ అయింది. ఈ గ్లింప్స్ కూడా సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్​గా తెరకెక్కుతున్న ఈ చిత్ర గ్లింప్స్​తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. ఈ వీడియోలో తారక్ చెప్పిన డైలాగ్, లుక్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ గ్లింప్స్​లో అభిమానులు, నెటిజన్లు ఒకటి గుర్తించారు. అదే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్యాగ్​ లైన్ మారడం. మ్యాన్​ ఆఫ్ మాసెస్​గా ఎన్టీఆర్ ట్యాగ్ లైన్ పడింది. ఇప్పటివరకు మ్యాన్​ ఆఫ్ మాసెస్​గా ఎన్టీఆర్​ను కేవలం పిలిచేవారు. కానీ ఈ సారి అఫీషియల్​గా స్క్రీన్​పై వేయడం విశేషం. ఈ పవర్ ఫుల్ ట్యాగ్ అభిమానులకు బాగా నచ్చేసింది.

అలా రీసెంట్​గా పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ ఐకానిక్ స్టార్​గా మారిపోతే ఇప్పుడు దేవర సినిమాతో ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్​గా మారిపోయారు. ఇకపోతే ఈ దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్​ సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్​కు దీటుగా పవర్ ఫుల్ విలన్​గా నటిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ ఫస్ట్‌ పార్ట్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేయబోతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'దేవర' బ్లడ్ బాత్​ - గ్లింప్స్​ చూస్తే గూస్​బంప్సే!

రాజమౌళి, మహేశ్​ సినిమా లేటెస్ట్​ అప్డేట్​ - స్విచ్ ఆఫ్ అంటున్న కీరవాణి!

Last Updated : Jan 9, 2024, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.