ETV Bharat / entertainment

ఎన్టీఆర్​-కల్యాణ్​ రామ్​ కాంబోలో బ్లాక్ బాస్టర్ మూవీ మిస్​.. ఇది వచ్చుంటేనా బాక్సాఫీస్ బద్దలే! - jr ntr and kalyan ram combo missed

jr ntr and kalyan ram movie : జూనియర్​ ఎన్టీఆర్​-కల్యాణ్​ రామ్​ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బాస్టర్ మూవీ ఏంటో తెలుసా? అప్పట్లో ఆ చిత్రం బాక్సాఫీస్​ ముందు మంచి విజయాన్ని అందుకుంది.

NTR Kalyanram
ఎన్టీఆర్​-కల్యాణ్​ రామ్​ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బాస్టర్ మూవీ తెలుసా?
author img

By

Published : Jul 9, 2023, 9:14 AM IST

jr ntr and kalyan ram movie : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌-క‌ల్యాణ్​ రామ్‌ల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నందమూరి బ్రదర్స్​.. ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి ఉంటారు. ఒకరి కోసం ఇంకొకరు ఎప్పుడూ అండగా నిలుస్తారు. వ‌రుస పరాజయాలతో స‌త‌మ‌తం అవుతున్న స‌మ‌యంలోనూ అన్న‌ కల్యాణ్​ రామ్​కు ఎన్టీఆర్ ఎన్నో సార్లు తోడుగా నిలిచారు. తాను నటించే సినిమాల్లో నిర్మాతగా వ్యవహరించేందుకు క‌ళ్యాణ్ రామ్​కు అవకాశం ఇచ్చారు.

అయితే ఈ అన్న‌ద‌మ్ముల క‌ల‌యిక‌లో ఒక మంచి హిట్​ సినిమా వ‌స్తే చూడాల‌ని ఎంతోమంది నంద‌మూరి అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ త‌రుణం.. ఇప్ప‌ట్లో వ‌చ్చేలా పరిస్థితులు అస్సలు క‌నిపించ‌డం లేదు. కానీ గ‌తంలో ఈ ఇద్దరి కలయికలో ఓ సూపర్​ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం మిస్ అయింద‌న్న సంగతి తెలుసా? ఇది చాలా మందికి తెలియకపోవచ్చు!

ఇంత‌కీ ఆ సినిమా మ‌రేదో కాదు. బ్లాక్​బాస్టర్​ హిట్ చిత్రం 'ఎవ‌డు'!. వంశీ పైడిపల్లి ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిందీ చిత్రం. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ హీరోగా నటించగా.. అల్లు అర్జున్ మరో కీలక పాత్ర పోషించారు. శృతి హాస‌న్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ కథానాయికలుగా నటించి ఆకట్టుకున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూపొందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్​పై నిర్మించారు. 2014న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం.. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని సాధించింది. అప్పట్లోనే రూ. 45 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను అందుకుందని తెలిసింది. అలాగే ఈ చిత్రాన్ని మలయాళంలో 'భయ్యా మై బ్రదర్' పేరుతో రీమేక్ చేయ‌గా.. అక్కడ కూడా సక్సెస్​ఫుల్​గా రన్​ అయింది.

NTTR upcoming projects : ఎన్టీఆర్​.. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం 'దేవర' చేస్తున్నారు. సీ కాన్సెప్ట్​తో ఇది రాబోతుంది. ఆ తర్వాత బాలీవుడ్​లో హృతిక్​ రోషన్​తో కలిసి 'వార్​ 2' మల్టీస్టారర్​ చిత్రం చేస్తున్నారు. ఇది త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనుంది. ఇక కల్యామ్​ రామ్​ విషయానికొస్తే.. ఆయన 'బింబిసార్ 2'తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఆయన ఆ తర్వాత 'అమిగోస్'​ చిత్రంతో నిరాశపరిచారు. ప్రస్తుతం 'బింబిసార 2', 'డెవిల్'​ చిత్రాలు చేస్తున్నారు. రీసెంట్​గా వచ్చిన డెవిల్ గ్లింప్స్​ సినిమాపై హైప్ పెంచింది. ఇక 'బింబిసార 2'.. డైరెక్టర్​ను మార్చాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదీ చూడండి :

వెకేషన్​ ప్లాన్​ చేసిన ఎన్టీఆర్​..​ ఫ్యామిలీతో ఫారిన్​ ట్రిప్​

బాలయ్య వల్ల దెబ్బలు తిన్న అడివి శేష్​.. ట్రాన్స్‌ఫార్మర్‌ పేల్చేసిన ఎన్టీఆర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.