ETV Bharat / entertainment

'జెర్సీ' కూడా బోల్తా.. బాలీవుడ్​లో రీమేక్​ల ఫ్లాప్​కు కారణం అదేనా? - విక్రమ్ వేద

Remakes in Bollywood: కొంత కాలం వెనక్కి వెళ్తే.. ఓటీటీ, యూట్యూబ్​లు అందుబాటులో లేవు. ఎక్కడైనా ఓ చిత్రం విడుదలై బాగుందనుకుంటే దానిని తమ భాషలో రీమేక్‌ చేసుకునేవారు. ఇప్పుడు కాలం మారింది. సినిమా లైబ్రరీలా ఉన్న యూట్యూబ్‌కు తోడు అర డజను ఓటీటీ ప్లాట్‌ఫాంలు భారతదేశంలోని వివిధ భాషల సినిమాలనే కాదు పలు విదేశీ చిత్రాలనూ మన కళ్ల ముందు ఉంచుతున్నాయి. వాటిని మన ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పటికే ఒకసారి చూసిన సినిమాను రీమేక్‌ చేసి వదిలితే రెండో సారి ప్రేక్షకులు చూస్తారా? అనేది బాలీవుడ్‌ సినీ పండితులను తొలుస్తున్న ప్రశ్న.

remakes in bollywood
bachchan pandey
author img

By

Published : Apr 29, 2022, 8:54 AM IST

Updated : Apr 29, 2022, 10:16 AM IST

Remakes in Bollywood: నాని నటించిన 'జెర్సీ' చిత్రాన్ని అదే పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. అది బాక్స్‌ఫీసు వద్ద పరాజయం పాలైంది. దీనిపై ఇటీవల రామ్‌గోపాల్‌ వర్మ నెగటివ్‌ కామెంట్లు విసిరారు. రీమేక్‌లకు ఇక కాలం చెల్లిందన్న కోణంలో ఆయన ట్వీట్‌లు ఉన్నాయి. ఈ దశలో బాలీవుడ్‌లో ఇప్పటికే రీమేక్‌ అవుతున్న వాటి సంగతేంటి? నిజంగానే రీమేక్‌లకు ప్రస్తుత కాలంలో బాక్సాఫీసు వద్ద ఆదరణ లభిస్తుందా? అంటే.. పరిశ్రమలో దీనిపై రెండు వాదనలు ఉన్నాయి. కథ తెలిసినది, పాతదే అయినా, ఒరిజనల్‌లోని ఆత్మ దెబ్బతినకుండా.. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తీస్తే విజయవంతమవుతుందని రీమేక్‌లను సమర్థించేవారి అభిప్రాయం. సృజనతో కూడిన కొత్త కథలు రాకుండా రీమేక్‌లు అడ్డం పడుతున్నాయని, ఓటీటీ యుగంలో బాక్సాఫీసు వద్ద వీటికి నిరాశ తప్పదనేది విమర్శకుల వాదన. పైగా మాతృకను తెరకెక్కించడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే అదే సినిమా రీమేక్‌కు అయ్యే బడ్జెట్‌ ఆకాశాన్నంటుతోందని బాలీవుడ్‌లో విమర్శిస్తున్నారు.

remakes in bollywood
సూర్య

అక్కడే రీమేక్‌లు ఎక్కువ: తెలుగులోనూ వివిధ భాషలకు సంబంధించిన సినిమాలు రీమేక్‌ అవుతున్నా.. అవి కొత్త కథలు పుట్టుకురాకుండా అడ్డుకునేంత సంఖ్యలో లేవు. 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'పుష్ప', తాజాగా వస్తున్న 'ఆచార్య' వంటి చిత్రాలు వస్తూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని ఇస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో సుమారు అరడజనుకు పైగా రీమేక్‌లు వచ్చే సంవత్సర కాలంలో విడుదల కానున్నాయి. వీటి హోరులో అక్కడ నేరుగా వచ్చే సినిమాల హడావిడే తగ్గిపోయింది. తాజాగా తమిళ సినిమాలు 'ఖైదీ', 'సూరరై పొట్రు' చిత్రాలను రీమేక్‌ చేస్తున్నట్లు ఆయా చిత్ర బృందాలు ప్రకటించాయి. అసలే దక్షిణాది చిత్రాల వరుస విజయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న బాలీవుడ్‌ బాక్సాఫీసుకు ఈ రీమేక్‌లు భారంగా మారతాయని అక్కడి విశ్లేషకులు చెబుతున్న మాట.

remakes in bollywood
'బచ్చన్ పాండే'

బీ టౌన్‌కి ఇదో అడ్డంకి: ప్రాంతీయ భాషల్లో అడపాదడపా రీమేక్‌ చిత్రాలు విజయం సాధిస్తున్నా.. బాలీవుడ్‌లో మొండి చెయ్యే ఎదురవుతోంది. దీనికి ప్రధాన కారణం డబ్బింగ్‌. హిందీ, హాలీవుడ్‌ చిత్రాలు ప్రాంతీయ భాషల్లోకి డబ్‌ అవడం చాలా అరుదుగా జరుగుతుంది. దీనికి భిన్నంగా ప్రాంతీయ చిత్రాలు పెద్ద సంఖ్యలో హిందీలో డబ్‌ అవుతున్నాయి. యూట్యూబ్‌ వంటి వీడియో స్ట్రీమింగ్‌ ఫ్లాట్‌ఫాంలో అందుబాటులో ఉంటున్నాయి. వాటి రీమేక్‌లు విడుదలయ్యే సమయానికి వివిధ ఫ్లాట్‌ఫాంలో డబ్బింగ్‌ సినిమాలను ప్రేక్షకులు చూసేస్తున్నారు. ఇటీవల విడుదలైన అక్షయ్‌కుమార్‌ 'బచ్చన్‌ పాండే' తెలుగు చిత్రం 'గద్దలకొండ గణేష్‌'కు రీమేక్‌. ఇదీ అక్కడి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. తాజాగా హిందీలో విడుదలైన సినిమా 'జెర్సీ'. నాని తెలుగు 'జెర్సీ'కి ఇది హిందీ రీమేక్‌. షాహిద్‌ కపూర్‌ లాంటి అగ్ర కథానాయకుడు ఉన్నా ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. విడుదలైన రెండు రోజులకే కలెక్షన్లు నేల చూపుల్ని చూడడం ప్రారంభించాయి. దీనికి అసలైన కారణం.. నాని నటించిన తెలుగు 'జెర్సీ' హిందీ డబ్బింగ్‌ను యూట్యూబ్‌లో రెండేళ్ల క్రితమే విడుదల చేశారు. ఇప్పటికే సుమారు 104 మిలియన్ల మంది ఉత్తరాది ప్రేక్షకులు ఆ చిత్రాన్ని చూసేశారు. ఇక వారికి కొత్త సినిమా చూస్తున్నామన్న అనుభూతి ఏముంటుంది? ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి, పెరిగిన టికెట్‌ ధరల్లో మళ్లీ అదే కథను ఎందుకు చూస్తారు? అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.

remakes in bollywood
'జెర్సీ'

అలా అయితే సాహసం చేయొచ్చు: మంచి కథ ఎక్కడ ఉన్నా దానిని ప్రేక్షకులకు అందించడం మా బాధ్యత అని గతంలో రీమేక్‌ చేస్తున్నపుడు దర్శకులు చెప్పేవారు. ఇపుడు అటువంటి బాధ్యతను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకుంది. ప్రస్తుతం ఓటీటీ విప్లవంతో సినిమా పరిశ్రమల మధ్య ఎల్లలు చెరిగిపోయాయి. మన వాళ్లు స్పానిష్‌ 'ది మనీ హెయిస్ట్‌', కొరియన్‌ 'స్క్విడ్‌ గేమ్‌' సిరీస్‌లను ఎగబడి చూశారు. వాటిని తెలుగులో డబ్బింగ్‌ చేసి ఆయా సంస్థలు అందుబాటులో ఉంచాయి. ఈ మార్పును దర్శక, నిర్మాతలు గుర్తించాలని విశ్లేషకులు చెబుతున్నారు. "రీమేక్‌లను పూర్తిగా చేయకూడదని కాదు. దానికి కాస్త విలువను జోడించి, మాతృకను మించి మురిపించగలమన్న నమ్మకం ఉంటే, సాహసం చేయొచ్చు." అని ఓ ప్రముఖ బాలీవుడ్‌ డిస్ట్రిబ్యూటర్‌ చెప్పారు.

remakes in bollywood
హృతిక్

హిందీలో రీమేక్‌ కానున్న చిత్రాలు:

  • అల వైకుంఠపురంలో..
  • ఖైదీ
  • సూరరై పొట్రు
  • విక్రమ్‌ వేధ
  • డ్రైవింగ్‌ లైసెన్స్‌
  • నాంది
  • బ్రోచేవారెవరురా!
  • హిట్‌

ఇదీ చదవండి: సమంతపై ప్రాంక్​.. విజయ్​ సర్​ప్రైజ్​ మామూలుగా లేదుగా!

Last Updated : Apr 29, 2022, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.