Jawan Opening Day Collection : 'పఠాన్' తర్వాత అభిమానులు, ప్రేక్షకుల ముందుకు 'జవాన్'గా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మరో బ్లాక్ బ్లస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా, ఆత్రుతగా ఎదురుచూశారనేది.. అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్సే చెప్పేశాయి. షారుక్ ఖాన్- కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కలిసి చేసిన సినిమా అవ్వడం వల్ల.. నార్త్ ఆడియెన్స్‌తో పాటు సౌత్ ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తిని, అంచనాలు భారీగా పెరిగాయి.
అయితే ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 7) అభిమానుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను అందుకుంది. ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్‌ను అందుకుంది. ఈ సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ భారీగా వచ్చి ఉంటాయని ట్రేడ్ వర్గాలు.. లెక్కల్ని అంచనాలు వేసి చెబుతున్నాయి. పఠాన్ ఓపెనింగ్స్ కన్నా ఎక్కువగా కలెక్ట్ చేసి ఉంటుందని అంటున్నారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా నిలుస్తుందని చెబుతున్నారు. ఇప్పుడీ చిత్రానికి ఓపెనింగ్ డే(నేడు సెప్టెంబర్ 7) దేశవ్యాప్తంగా దాదాపు రూ. 65కోట్ల నెట్ వసూలు వస్తాయని అంటున్నారు. కాగా, ఈ సినిమాకు నార్త్‌లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి ఓపెనింగ్స్ దక్కాయని తెలిసింది. ముఖ్యంగా తెలుగు, తమిళ ఓపెనింగ్స్ ఆశించిన దాన్ని కన్నా ఎక్కువగా వచ్చాయని చెబుతున్నారు.
Jawan Review : షారుక్ మాస్ అవతార్, కథనం, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, మాస్ అంశాలు సినిమాకు ప్లస్‌గా నిలిచాయి. సెకాండాఫ్‌లో కొన్ని సీన్స్ చిత్రానికి మైనస్‌గా నిలిచాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జవాన్... పైసా వసూల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని నెటిజన్లు, సినీ ప్రియులు రివ్యూలు ఇస్తున్నారు. దీంతో షారుక్ పఠాన్ తర్వాత మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నట్టైంది.
Jawan Cast and Crew : సినిమాలో షారుక్ ఖాన్‌తో పాటు నయనతార, విజయ్ సేతుపతి, దీపిక పదుకొణె, ప్రియమణి, సునీల్ గ్రోవర్, సాన్య మల్హోత్ర, యోగిబాబు తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం, జి.కె.విష్ణు సినిమాటోగ్రఫీ అందించారు. రుబెన్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ నిర్మాతలుగా వ్యవహరించారు. రమణ గిరివసన్ స్క్రీన్‌ప్లే కథ అందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Miss Shetty Mr Polishetty VS Jawan : రెండు సినిమాలు ఒకే ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Jawan Movie Telugu Review : 'జవాన్'లో అన్ని షేడ్స్.. షారుక్ ప్రేక్షకులను మెప్పించారా ?