Jawan Day 6 Box Office Collection : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా రోజుకో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన రోజు నుంచే థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సినిమా ఆరో రోజు అన్ని భాషలకు కలిపి రూ. 28.50 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజు రూ. 75 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ ఆ తర్వాత రూ. 53.23 కోట్లు, రూ.77.83 కోట్లు, రూ.80.1 కోట్లు, రూ.32.92 కోట్లు, రూ.30 కోట్లు ఇలా పెద్ద మొత్తంలో వసూలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ రూ. 574.89 కోట్లకు పైగా వసూలు చేసి 600 కోట్ల క్లబ్‌లోకి చేరేందుకు సిద్ధమైంది.
-
The box office is running high with King Khan!✨🔥
— Red Chillies Entertainment (@RedChilliesEnt) September 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Have you watched it yet? Go book your tickets now!https://t.co/B5xelU9JSg
Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/ACjLyO4D4H
">The box office is running high with King Khan!✨🔥
— Red Chillies Entertainment (@RedChilliesEnt) September 12, 2023
Have you watched it yet? Go book your tickets now!https://t.co/B5xelU9JSg
Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/ACjLyO4D4HThe box office is running high with King Khan!✨🔥
— Red Chillies Entertainment (@RedChilliesEnt) September 12, 2023
Have you watched it yet? Go book your tickets now!https://t.co/B5xelU9JSg
Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/ACjLyO4D4H
Jawan Cast : భారీ అంచనాలు క్రియేట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకొచ్చిన 'జవాన్' సినిమాకు థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో షారుక్ లుక్ కొత్తగా ఉందని, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయంటూ సినిమా చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో షారుక్‌కు జోడీగా తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా.. విజయ్ సేతుపతి, సీనియర్ నటి ప్రియమణి , బాలీవుడ్ నటి సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్ గ్రోవర్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించి ఆడియెన్స్‌ను మెప్పించారు. దీపికా పదుకొణె, సంజయ్ దత్ లాంటి స్టార్స్ అతిథి పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు.
Jawan Day 5 Box Office Collection : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్- అట్లీ కాంబినేషన్లో తెరకెక్కిన 'జవాన్' మూవీ.. రిలీజైన రోజు నుంచి రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజు రూ. 75 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. క్రమ క్రమంగా వసూళ్లను పెంచుకుంటూ సంచలనాలు సృష్టిస్తోంది. ఇక ఐదో రోజు ఈ సినిమా ఇండియాలో రూ.30 కోట్ల నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమచాారం.
ఇక ఓవర్సీస్ లో రూ.177 కోట్ల వసూళ్లతో... రూ.316 కోట్ల నెట్ అందుకుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఐదు రోజుల్లో రూ.520 కోట్లు రాబట్టినట్లు ట్రెడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో 2023లో భారతదేశంలో రూ. 300 కోట్ల మార్కును దాటిన మూడవ బాలీవుడ్ చిత్రంగా 'జవాన్' చరిత్రకెక్కింది.
Sharukh Khan Jawan Movie Collection : మరోవైపు షారుక్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమా రికార్డులను ఈ 'జవాన్' అధిగమిస్తోంది. పఠాన్ సినిమా తొలి రోజు రూ.57 కోట్లు సంపాదించగా.. 'జవాన్' మాత్రం రూ. 75 కోట్లు వసూలు చేసి టాప్కు చేరుకుంది. అలా ఒకే ఏడాదిలో తాను నటించిన రెండు సినిమాలకు రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించిన ఏకైక ఇండియన్ స్టార్‌గా చరిత్రకెక్కాడు. ఆయన నటించిన రెండు సినిమాలు ఇలా ఒకదానికి మించి ఒకటి రికార్డు స్థాయిలో వసూలు సాధించడం పట్ల షారుక్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట 'జవాన్'తో పాటు 'పఠాన్' సినిమాను ట్రెండ్ చేస్తున్నారు.
Miss Shetty Mr Polishetty VS Jawan : రెండు సినిమాలు ఒకే ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Action Movies 2023 : ఈ హీరోలు యాక్షన్‌లోకి దిగితే.. విలన్లకు దబిడి దిబిడే..