ETV Bharat / entertainment

Jawan Advance Booking : అడ్వాన్స్​ బుకింగ్​లో 'జవాన్' రికార్డుల మోత.. బాద్​షా మూవీ అంటే ఈ మాత్రం ఉంటుందిలే! - పఠాన్ ఫస్ట్ డే కలెక్షన్స్

Jawan Advance Bookings Collection : బాలీవుడ్ స్టార్ హీరో షారుక్​ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయయతార జంటగా నటించిన చిత్రం జవాన్. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో జవాన్ అడ్వాన్స్​ బుకింగ్ సేల్స్​లో రికార్డులు సృష్టిస్తోంది.

Jawan Advance Booking Collection
Jawan Advance Booking Collection
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 1:10 PM IST

Updated : Sep 4, 2023, 2:45 PM IST

Jawan Advance Bookings Collection : బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్ హీరోగా భారీ బడ్జెట్​తో రూపొందిన చిత్రం 'జవాన్'. ఈ సినిమాను తమిళ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కించారు. దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో హీరోయిన్​గా నటించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్​కు మంచి స్పందన లభిస్తోంది. రీసెంట్​గా చెన్నైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​ను కూడా ఘనంగా నిర్వహించారు. ఇక సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Jawan Release Date : అయితే సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నందున 'జవాన్' అడ్వాన్స్​ బుకింగ్ సేల్స్ ఊపందుకున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే 6 లక్షల టికెట్లు అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది. ఇందులో అత్యధికంగా 5.41 లక్షలకుపై (వీటి విలువ సుమారు రూ. 15.59 కోట్లు) హిందీ వెర్షన్ టికెట్లు ఉండగా.. తమిళ్ వెర్షన్ 20 వేలు, తెలుగులో 16 వేల టికెట్లు బుక్​ అయ్యాయట. అంటే ఈ ప్రీ బుకింగ్స్ విలువ సుమారు రూ. 16.93 కోట్లు ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా.

Jawan Overseas Advance Booking : ఓవర్​సీస్​లోనూ షారుక్ మార్క్ కనిపిస్తోంది. యూకేలో ఇప్పటివరకూ అడ్వాన్స్ సేల్స్ 1,50,000 పౌండ్లు వసూల్ చేసింది. అయితే ఇప్పటివరకూ అక్కడ ఓపెనింగ్ సేల్స్​లో.. షారుక్ 'పఠాన్' 3,19,000 పౌండ్లతో టాప్​లో ఉంది. ఇక 'జవాన్' సినిమాకు మరో మూడు రోజుల సమయం ఉంది కాబట్టి.. ఆ రికార్డును 'జవాన్' పక్కా బ్రేక్​ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు యూఎస్​లో కూడా 'జవాన్' బుకింగ్స్ దూసుకుపోతున్నాయి. ఇప్పటివరకూ ప్రీ బుకింగ్స్​లో 4,01,755 డాలర్ల సేల్స్​తో రికార్డు కొట్టింది. 450పైగా లొకేషన్స్​లో 26,765 టికెట్లు బుక్కైనట్లు తెలుస్తోంది.

పఠాన్​కు ధీటుగా.. అయితే ఈ ఏడాది ప్రారంభంలో షారుక్ 'పఠాన్' మూవీ ప్రీ బుకింగ్ సేల్స్ కూడా అప్పడు ఇదే రేంజ్​లో దూసుకుపోయాయి. 'పఠాన్' ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ. 100 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్స్​ సాధించింది. ప్రస్తుతం 'జవాన్' జోరు చూస్తుంటే.. ఈ సినిమా కూడా రూ. 100 కోట్ల ఓపెనింగ్ క్లబ్​లో చేరే ఛాన్స్​ ఉందని అంటున్నారు. ఒకవేళ ఇదే గనక జరిగితే.. బ్యాక్​ టు బ్యాక్ సినిమాలతో వరల్డ్​వైడ్​గా రూ.100 కోట్ల ఓపెనింగ్స్​ చేసిన తొలి బాలీవుడ్ నటుడిగా షారుక్ రికార్డు కొడతారు. ఇక 'పఠాన్' రూ. 1000 కోట్లు వసూల్ చేసిన విషయం తెలిసిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Jawaan Trailer : 'జవాన్' ట్రైలర్​ వచ్చేసిందోచ్​.. పవర్​ఫుల్​ యాక్షన్ అండ్​ ఫన్నీ​ సీన్స్​తో​..

Jawan Pre Release Event : చెన్నైలో గ్రాండ్​గా 'జవాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. బాద్​షా ఎంట్రీ అదుర్స్​

Last Updated : Sep 4, 2023, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.