ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడైన ఒర్హాన్‌తో యంగ్ హీరోయిన్ జాన్వీకపూర్ డేటింగ్లో చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. బీటౌన్ ఫంక్షన్స్‌లో వీరిద్దరూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. పార్టీలు, డిన్నర్లు, విదేశీ టూర్లు.. ఇలా ఎక్కడికైనా ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. రిద్దరూ కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌గానూ మారాయి. ఈ నేపథ్యంలో 'మిలీ' సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న జాన్వీ దీనిపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అతడితో ఉంటే తాను ఎప్పుడూ సంతోషంగా ఉంటానని ఆమె పేర్కొంది.
"ఒర్హాన్ నాకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. అతడితో ఉంటే నేను ప్రతిక్షణం ఆనందంగానే ఉంటా. అన్ని విషయాల్లోనూ ఎంతోకాలం నుంచి అండగా నిలిచాడు. అతడిని ఎంతో నమ్మాను. అతడు నా పక్కన ఉంటే మా ఇంట్లో ఉన్నాననే భావన కలుగుతుంది" అని తెలిపారు.కాగా, జాన్వి చెప్పిన మాటలు వింటుంటే వీరిద్దరూ రిలేషన్లో ఉన్న మాట వాస్తవమే అయి ఉంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు.
ఇదీ చూడండి: ఆ స్టార్ హీరో సినిమాకు డ్యాన్స్ అసిస్టెంట్‌గా కమల్‌హాసన్!