ETV Bharat / entertainment

'నా చెల్లి కోసం యాక్టింగ్​నైనా మానేస్తా.. తన సంతోషమే ముఖ్యం' - జాన్వీ కపూర్​ ఆసక్తికర వ్యాఖ్య

జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న నాయిక. కమర్షియల్‌ చిత్రాలకు భిన్నంగా కొత్త బాటలో పయనిస్తున్న జాన్వీకి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆమె సోదరి ఖుషీ కపూర్‌ కూడా వెండితెరకు పరిచయం కాబోతుంది. తన సినిమా "మిలీ" ప్రమోషన్స్​లో బిజీ బిజీగా గడుపుతున్న నటి జాన్వీకపూర్​.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన చెల్లి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు చెప్పుకొచ్చింది.

Etv Bharatjanhvi-kapoor-now-understands-why-sridevi-once-howled-on-call-saying-dont-want-to-act-again
జాన్వీ కపూర్​ ఆసక్తికర వ్యాఖ్య
author img

By

Published : Oct 30, 2022, 9:39 AM IST

అతిలోక సుందరి శ్రీదేవి, బాలీవుడ్​ బడా నిర్మాత బోనీ కపూర్​ గారాలపట్టి జాన్వీ కపూర్​. సినీ నేపథ్యం నుంచి వచ్చినా తనకంటు ఓక స్టార్​ డమ్​ను సంపాదించుకుందీ సుందరి. బాలీవుడ్​లో తన సొంత ప్రతిభతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చెల్లి ఖుషీ కపూర్ సైతం సినీఇంస్ట్రీలో అడుగుపెట్టేందుకు సై అంటోంది. ప్రస్తుతం జాన్వీ "మిలీ" చిత్ర ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వీ.. చెల్లి ఖుషి కపూర్​ గురించి ఇంట్రెష్టింగ్​ విషయాలు చెప్పింది.

"ఖుషి కపూర్​కు నన్ను నేను ఒక తల్లిగా భావించుకుంటున్నా. మా అమ్మ నాతో చెప్పిన విషయాలు ఒక్కోసారి నా ఆలోచనలోకి వస్తాయి. దాన్ని నా చెల్లితో పంచుకుంటా. ఖుషి మొదటి రోజు షూట్‌లో ఆమె హెయిర్​ స్టైల్​, మేకప్​ కోసం నేను అక్కడే ఉన్నాను. కానీ ఆమె మొదటి షాట్ తీయడానికి ముందే నేను అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది. బవాల్ సినిమా షూట్​ కోసం తప్పని పరిస్థితిలో లక్నో బయలుదేరాల్సి వచ్చింది. అప్పుడు బాగా ఏడుపు వచ్చింది. మా చెల్లి గుర్తుకొచ్చింది. ఆ సమయంలో నా మూడ్ అస్సలు బాగాలేదు. ఖుషి మెుదటి షూట్​లో నేను లేకపోవడం చాలా బాధ కలిగించింది. మా చెల్లి బాగోగుల కోసం నటననైనా వదిలేస్తా. ఖుషి సంతోషంగా ఉండడమే నాకు కావాలి. అమ్మ "ఇంగ్లీష్ వింగ్లీష్" షూటింగ్​లో ఉన్నప్పుడు ఆమె ఖుషి బర్త్​డేకి రాలేకపోయినందుకు చాలా బాధపడి నాకు ఫోన్​ చేసింది. ఆ క్షణాలు ఇంకా నాకు గుర్తున్నాయి" అని జాన్వీ కపూర్​ తన చెల్లిపై ప్రేమను వ్యక్తం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.