ETV Bharat / entertainment

Jailer Producer Gifted Car To Director : హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్‌కు ఖరీదైన కార్ గిఫ్ట్! - రజనీకి కారు గిఫ్ట్​ ఇచ్చిన జైలర్​ నిర్మాత

Jailer Producer Gifted Car To Director : 'జైలర్' సక్సెస్​ను ఆస్వాదిస్తున్న సినిమా నిర్మాత కళానిధి మారన్.. హీరో రజనీకాంత్​, దర్శకుడు నెల్సన్​కు ఓ స్వీట్​ సర్​ప్రైజ్​ ఇచ్చారు. వాళ్లిద్దరికీ ఖరీదైన కార్లు బహుమతి ఇచ్చారు. ఆ కారును మీరు కూడా ఓ సారి చూసేయండి మరి..

jailer producer gifted car to director
jailer producer gifted car to director
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 11:03 PM IST

Updated : Sep 2, 2023, 10:10 AM IST

Jailer Producer Gifted Car To Director : సూపర్​ స్టార్​ రజనీకాంత్ నటించిన 'జైలర్' విడుదలై మూడు వారాలు దాటినప్పటికీ.. థియేటర్ల వద్ద ఇంకా ఆ హవా కొనసాగుతూనే ఉంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా.. ఆ అంచనాలను దాటుతూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో చిత్ర యూనిట్​ సంబరాలు చేసుకుంటోంది.

ఇక చిత్ర నిర్మాత, సన్​ పిక్చర్స్​ ఛైర్మన్ కళానిధి మారన్ ఆనందం అయితే మాటల్లో చెప్పలేనిది. ఈ విజయోత్సాహంలో మారన్.. హీరో రజనీకాంత్​తో పాటు దర్శకుడు నెల్సన్‌ దిలీప్​కుమార్​కు ఓ ఊహించని సర్​ప్రైజ్​ ఇచ్చారు. మొదట రజనీకి ఓ బీఎమ్​డబ్ల్యూ ఎక్స్​7 కారును బహుమతిగా ఇచ్చిన ఆయన.. తాజాగా దర్శకుడు నెల్సన్​ దిలీప్​ కుమార్​కు ప్రముఖ స్పోర్ట్స్​ కార్​ 'పోర్షా' లేటెస్ట్‌ వెర్షన్​ను గిఫ్ట్​గా ఇచ్చారు. దీంతో పాటు ఈ ఇద్దరికీ కొంత నగదును చెక్​ రూపంలో అందజేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్​ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దీన్ని చూసిన ఫ్యాన్స్​ నెట్టింట రజనీ, నెల్సన్​తో పాటు చిత్ర యూనిట్​కు అభినందనలు తెలుపుతున్నారు.

Rajnikanth Jailer Box Office Record : నెల్సన్ దిలీప్​కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రిలీజైనప్పటి నుంచి బాక్సాఫీస్​ వద్ద సంచలనం సృష్టించిన 'జైలర్'.. ఇప్పటికీ కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో కోలీవుడ్​లో అత్యధిక కలెక్షన్లు (రూ. 600 కోట్లకుపైగా) వసూల్​ చేసిన రెండో సినిమాగా నిలిచింది. అయితే ఈ లిస్ట్​లో రూ.665 కోట్లతో రోబో 2.O (Robot 2.0) మొదటి స్థానంలో ఉంది. అయితే ఈ రెండు సినిమాలు రజనీయే కావడం విశేషం.

Rajinikanth Jailer Cast : యాక్షన్​, సెంటిమెంట్​,కామెడీ ఇలా అన్ని అంశాలను ఎంతో చక్కగా ఆయన చూపించారు. ఇందులో రజనీ సరసన సీనియర్ హీరోయిన్​ రమ్యకృష్ణ మెరవగా.. మిల్క్​ బ్యూటీ తమన్న ఓ కీలక పాత్ర పోషించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్​ హీరో శివ రాజ్‌కుమార్ ఇతర ముఖ్యపాత్రలో నటించి ఆడియెన్స్​ను ఆకట్టుకున్నారు. ఇక రజనీకాంత్​ కూడా తన మార్క్​ స్టైల్​తో ప్రేక్షకులకు వింటేజ్​ రజనీని గుర్తుచేశారు. యంగ్​ మ్యూజిక్​ డైరెక్టర్​ అనిరుధ్​ రవిచందర్​ అందించిన మ్యూజిక్​.. ఈ సినిమాకు మరో హైలైట్​గా నిలవగా..సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబులు సైతం తమ తమ పాత్రలతో ప్రేక్షకులను అలరించారు.

Jailer Ott Release Date : 'జైలర్' ఓటీటీ కోసం రజనీ ఫ్యాన్స్ నిరీక్షణ.. రిలీజ్ అయ్యేది అప్పుడే!

Thalaivar 170 Update : 'జైలర్' సక్సెస్​ సెలబ్రేషన్స్​లో రజనీ.. 'జై భీమ్'​ దర్శకుడితో సినిమా షురూ!

Last Updated : Sep 2, 2023, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.