Jailer Movie Rajinikanth : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ అనూహ్య స్పందనతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. అలా ఈ ఏడాది విడుదలైన సూపర్ హిట్ మూవీస్ లిస్ట్‌లోకి చేరుకుంది. ఇక ఈ సినిమాలో ముత్తువేల్ పాండ్యన్ అనే పాత్రలో రజనీ కనిపించారు. ఎప్పటిలాగే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే తాజాగా ఈ మూవీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
"జైలర్ షూటింగ్ ప్రారంభించగానే కొంతమంది అభిమానులు, ప్రముఖులు నాకు మెసేజ్‌లు పంపారు. 'మీరు రజనీతో ఎలాంటి ప్రయోగాలైనా చేయండి కానీ, ఆయన్ను తెల్ల జుట్టులో చూపించొద్దు. ఆయన ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో ఉన్న విధంగానే ఈ సినిమాలోనూ చూపండి అని వాటి సారాంశం. అయితే వాటిని చూశాక పెద్ద సవాలు ఎదురైందని అనుకున్నాను. ఎందుకంటే నేను రాసుకున్న స్టోరీలో ఆయన్ను పెద్ద వయసులో ఉన్న వ్యక్తిగా చూపించాలి. దీంతో రజనీని అలా చూపించాలంటే మొదట్లో భయం వేసింది. ఆడియెన్స్‌ను మెప్పించగలనా అనే డౌట్ వచ్చింది. విమర్శలు వస్తే స్వీకరించడానికి రెడీ అన్నట్లుగానే 'జైలర్'ను తెరకెక్కించాను. కొన్ని రోజులు షూటింగ్ తర్వాత నాపై నాకు నమ్మకం వచ్చింది. ఇక సినిమా రిలీజయ్యాక రజనీ గెటప్‌కు ఎంత గొప్ప స్పందన వచ్చిందో అందరికీ తెలిసిందే" అని నెల్సన్ దిలీప్ కుమార్ అప్పటి ఘటనను గుర్తుచేసుకున్నారు.
మరోవైపు రజనీ ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో తలైవర్ 170 అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇందులో అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. యథార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని అల్లుకున్న ఓ ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్ లాంటి స్టార్స్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
Thalaivar 171 Cast : 'జైలర్' సక్సెస్ ఫార్ములా.. అప్‌కమింగ్ మూవీస్ కోసం రజనీ బిగ్ ప్లాన్..