ETV Bharat / entertainment

''జైలర్‌'లో పోలీస్​ పాత్ర కోసం బాలకృష్ణను అనుకున్నా.. ఫ్యూచర్​లో ఆయనతో సినిమా పక్కా!' - రజనీకాంత్ జైలర్ బాలకృష్ణ నెల్సన్

Jailer Director Nelson Abou Nandamuri Balakrishna : సూపర్​ స్టార్ రజనీకాంత్‌ నటించిన జైలర్​ సినిమా హిట్​ టాక్ సొంతం చేసుకుంది. దీంతో​ విజయోత్సాహంలో భాగంగా అగ్ర కథానాయకుడు నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు ఈ సినిమా దర్శకుడు నెల్సన్‌. అవేంటంటే?

Jailer Director Nelson Abou Nandamuri Balakrishna

author img

By

Published : Aug 11, 2023, 10:51 PM IST

Jailer Director Nelson Abou Nandamuri Balakrishna : రజనీకాంత్​ హీరోగా నటించిన జైలర్​ చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్​కుమార్​.. టాలీవుడ్ దిగ్గజ కథానాయకుడు నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా విజయం సాధించిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నెల్సన్​ కొన్ని విశేషాలు పంచుకున్నారు. జైలర్​ చిత్రంలోని ఓ పాత్ర నందమూరి బాలకృష్ణను తీసుకోవాలని అనుకున్నానని.. కానీ అది సాధ్యపడలేదు అని తెలిపారు.

'తెరపై రజనీకాంత్‌ సర్‌ ఒక్కరు కనిపిస్తేనే జోష్‌ వస్తుంది. అందుకే ఈ సినిమాని మల్టీస్టారర్‌గా తీయాలనుకోలేదు. స్పెషల్​ అట్రాక్షన్ కోసమే మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌లను ఎంపిక చేశాను. వీరు నటించడం వల్ల 'జైలర్‌' మల్టీస్టారర్‌ అనే ఊహాగానాలు వచ్చాయి. ఇందులోని ఓ పోలీసు పాత్ర కోసం తెలుగు హీరో బాలకృష్ణను అనుకున్నా. కానీ, కథానుగుణంగా ఆ క్యారెక్టర్‌ను సరిగా డిజైన్‌ చేయలేకపోయా. అలాంటప్పుడు ఆయన్ను ఎంపిక చేయడం సరైంది కాదనిపించింది. అందుకే ఆయన్ను అసలు సంప్రదించలేదు. నటించేందుకు ఆయన అంగీకరించేవారో, లేదో తర్వాతి సంగతి. భవిష్యత్తులో ఆయనతో సినిమా చేస్తానేమో' అని నెల్సన్‌ అన్నారు. ఒకవేళ ఈ సినిమాలో బాలకృష్ణ కూడా భాగమై ఉండి ఉంటే మరో రేంజ్‌లో ఉండేదనే చర్చ ఇప్పటికే నెట్టింట మొదలైంది.

Rajinikanth Balakrishna : రజనీకాంత్‌ హీరోగా నటించిన 'జైలర్' చిత్రం హిట్‌టాక్‌తో దూసుకెళ్తోంది. ఆయన యాక్షన్‌, స్టైల్‌కు ప్రేక్షకలోకం ఫిదా అవుతోంది. యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో రజనీకాంత్‌ రిటైర్డ్ పోలీస్ అధికారిగా నటించారు. జాకీష్రాఫ్‌, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్‌, యోగిబాబు, వసంత్‌ రవి, మిర్నా మేనన్‌ కీలక పాత్రలు పోషించారు. తెరపై రజనీకాంత్‌ కనిపించి దాదాపు రెండేళ్లుకావడంతో ఆయన అభిమానులు ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రం వారి అంచనాలు అందుకుంది.

Jailer Day 1 Collections : తెలుగులో రెండు రాష్టాల్లో కలిపి ఈ సినిమా రూ.13 కోట్ల‌కుపైగా గ్రాస్‌ను, ఏడు కోట్ల‌కుపైగా షేర్‌ను రాబ‌ట్టింది. సీడెడ్‌లో రూ.కోటి, ఉత్త‌రాంధ్ర‌లో రూ.90 ల‌క్ష‌లు, గుంటూరులో రూ. 65 ల‌క్ష‌లు, కృష్ణ‌ాలో రూ. 50 ల‌క్ష‌లు మేర కలెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు తెలిసింది. తెలుగులో రిలీజైన ర‌జ‌నీకాంత్ డ‌బ్బింగ్ మూవీస్‌లో అత్యధిక వసూళ్లను రాబ‌ట్టిన రెండో సినిమాగా చరిత్రకెక్కింది.

అదీ బాలయ్య మంచి మనసు అంటే.. ఈ విషయం తెలిస్తే ఎవరైనా జై కొట్టాల్సిందే!

లైనప్​తో బాలయ్య ఫుల్​ బిజీ.. ఆ సీనియర్​ డైరెక్టర్​కు ఛాన్స్​ దొరుకుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.