ETV Bharat / entertainment

Jailer Actor Passed Away : డబ్బింగ్​ చెబుతూ 'జైలర్'​ నటుడు మృతి.. - జైలర్​ నటుడు మారిముత్తు

Jailer Actor Passed Away : 'జైలర్' సినిమాలో కీలక పాత్ర పోషించిన తమిళ నటుడు మారిముత్తు తుది శ్వాస విడిచారు. 56 ఏళ్లు ఈ స్టార్​ గుండెపోటు కారణంగా కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో కోలీవుడ్​ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగింది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 11:17 AM IST

Updated : Sep 8, 2023, 12:24 PM IST

Jailer Actor Passed Away : 'జైలర్' సినిమాలో కీలక పాత్ర పోషించిన తమిళ నటుడు మారిముత్తు తుది శ్వాస విడిచారు. 56 ఏళ్ల ఈ స్టార్​ గుండెపోటు కారణంగా కన్నుమూశారు. ఓ సీరియల్​కు డబ్బింగ్ చెప్తున్న సమయంలో ఆయన స్పృహ తప్పి పడిపోగా.. అది చూసిన సిబ్బంది అప్రమత్తమై ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఆయన మరణ వార్తతో కోలీవుడ్​ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగింది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.

Marimuthu Jailer : 'జైలర్' సినిమాలో విలన్​కు నమ్మకస్తుడిగా ఉండే పన్నీర్​ అనే పాత్రలో మారిముత్తు నటించారు. తన విలక్షణ నటనతో అందరిని అబ్బురపరిచారు. 'విక్రమ్' సినిమాలో కూడా మారిముత్తు ఓ కీలక పాత్ర పోషించారు. ఓ కమెడియన్​గా, ఓ క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా తన కెరీర్​లో ఆయన ఇప్పటివరకు సుమారు 100కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఓ సహాయ దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన మారిముత్తు .. ఆ తర్వాత నటుడిగా మారారు. మణిరత్నం, ఎస్​​జే సూర్య, వసంత సీమన్, లాంటి దర్శక నిర్మాతల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు. 1999లో తమిళ సినిమా 'వాలి'తో నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2008లో వచ్చిన 'కన్నుమ్ కన్నుమ్' అనే చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆయన నటించిన ప‌లు త‌మిళ సినిమాలు తెలుగులో అనువాద‌మై పెద్ద విజ‌యాల్ని అందుకున్నాయి.

Marimuthu Serials : తమిళ ఇండస్ట్రీలోని స్టార్స్​, దర్శకులు, నిర్మాతలు ఇలా అందరితో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. వెండితెరపైనే కాకుండా బుల్లితెరలోనూ మారిముత్తు మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళంలో ప్రసారమైన 'యాంటీ స్విమ్మింగ్' అనే సీరియల్​లో నటించిన ఆయన.. తన నటనతో బుల్లితెర ఆడియెన్స్​ను అలరించారు. అలా టీవీ రంగంలోనూ పాపులారిటీ సంపాదించుకున్నారు. 'ఎథిర్ నీచల్' సీరియల్‌లో ఆయన పోషించిన ఆదిముత్తు గుణశేఖరన్ పాత్రకు మంచి ప్రశంసలు అందుకున్నారు.

Spandana Death : ప్రముఖ నటి దివ్య స్పందన మృతిచెందారా?.. అసలు నిజమిదే

19రోజుల్లో మ్యారేజ్ డే.. గుండెపోటుతో నటుడి భార్య కన్నుమూత.. వెకేషన్​లోనే..

Last Updated : Sep 8, 2023, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.