ETV Bharat / entertainment

KGF: 'కేజీయఫ్‌' (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌) కథ నిజమేనా?

Is KGF Story Real: రాకింగ్​ స్టార్​ యశ్​ నటించిన 'కేజీఎఫ్​ ఛాప్టర్ 2' కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. తొలి భాగంలో హీరో ఎలివేషన్స్​తో ప్రేక్షకులను కట్టిపడేసిన మరో అంశం.. కథ. బంగారు సామ్రాజ్యానికి అధిపతి అయ్యేందుకు కొందరి వ్యక్తుల పోరు.. అక్కడి కార్మికుల కష్టాలను ఆసక్తికరంగా చూపించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే తొలి భాగం వచ్చిన నాటి నుంచి ఈ కథ నిజమేనా అనే అనుమానం చాలా మందిలో కలిగింది. ఇందులో వాస్తవం ఎంత?

is kgf story real
kgf real story
author img

By

Published : Apr 10, 2022, 3:56 PM IST

Updated : Apr 10, 2022, 5:26 PM IST

Is KGF Story Real: భూమిలో దాగున్న బంగారాన్ని బయటకు తీసేందుకు కార్మికులు పడే కష్టాన్ని, ఆ బంగారు సామ్రాజ్యానికి అధిపతి అయ్యేందుకు కొంతమంది వ్యక్తులు చేసే అలుపెరగని పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన పవర్‌ప్యాక్డ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'కేజీయఫ్‌'. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో యశ్‌ కీలకపాత్ర పోషించారు. మరికొన్ని రోజుల్లో 'కేజీయఫ్‌-2' ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా 'కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌' (కేజీయఫ్‌)గా ప్రాచుర్యం పొందిన ఈ ప్రాంతం, దాని చరిత్ర గురించి తెలుసుకుందాం.

KGF
'కేజీయఫ్'

'కేజీయఫ్‌' ఎక్కడ..?

'కేజీయఫ్‌' అంటే కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌ జిల్లాలో ఈ ప్రాంతం ఉంది. కోలార్‌ నగరానికి 30 కిలోమీటర్లు, బెంగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో ఈ గోల్డ్‌ ఫీల్డ్స్‌ ఉన్నాయి. సుమారు 100 సంవత్సరాలపాటు ఆ ప్రాంతంలో బంగారం కోసం తవ్వకాలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. వరుస తవ్వకాలతో బంగారు గనులు అంతరించిపోవడం వల్ల 2001 నుంచి ఇక్కడ తవ్వకాలను పూర్తిగా నిలిపివేశారు.

KGF
'కేజీయఫ్‌2'

ఎలా బయటకు వచ్చింది..?

కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే కోలార్‌లో బంగారు గనులు ఉన్నట్లు తెలుస్తోంది. కైవర గంగాస్‌, కోలార్‌ గంగాస్‌, చోళులు, విజయనగర రాజులు ఇలా ఎంతోమంది కర్ణాటకను పరిపాలించిన అనంతరం అధికారంలోకి వచ్చిన టిప్పు సుల్తాన్‌ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేశాడు. ఆంగ్లేయులతో జరిపిన పోరాటంలో ఆయన కన్నుమూసిన తర్వాత మైసూర్‌ ప్రాంతం బ్రిటిష్‌ వారి వశమైంది. అదే సమయంలో బ్రిటిష్‌ గవర్నర్‌ జాన్‌ వారెన్‌.. కోలార్‌ మట్టిలో బంగారం ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఇదే విషయాన్ని ఆయన ఓ పుసక్తంలోనూ రాసుకొచ్చారు. బంగారాన్ని వెలికి తీయాలని ఆ పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్థుల సాయంతో మట్టి తవ్వకాలు చేపట్టాడు. ఎక్కువ మొత్తంలో మట్టిని సేకరించి పరిశీలించగా.. అందులో అతి తక్కువ మొత్తంలో బంగారం ఉందని, ఇది ఒక వృథా ప్రయత్నమేనని భావించి మధ్యలోనే తన మిషన్‌ని నిలిపివేశాడు.

KGF
'కేజీయఫ్‌'

1850 తర్వాత లావెల్లీ అనే ఓ బ్రిటిష్‌ అధికారి వారెన్‌ రాసిన పుస్తకాన్ని చదివి బంగారు తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడున్న మైసూర్‌ రాజుల నుంచి గనుల తవ్వకాలకు సంబంధించి అనుమతులు తీసుకున్నాడు. కాలక్రమంలో జాన్‌ టేలర్‌ కంపెనీ చొరవతో కోలార్‌లో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. తవ్వకాలకు అవసరమైన విద్యుత్‌ కోసం ఓ భారీ పవర్‌ ప్లాంట్‌ని సైతం ఇక్కడ నిర్మించారు. 30,000 మంది కార్మికులు ఈ ఫీల్డ్స్‌లో పని చేశారు. ఏళ్లు గడిచే కొద్దీ బంగారు గనులు అంతరించిపోవడం వల్ల ఆ ప్రాంతంలో తవ్వకాలను ప్రభుత్వం (2001) పూర్తిగా నిలిపివేసింది.

KGF
'కేజీయఫ్‌2'

సినిమా రియల్‌ కాదు కానీ..!

'కేజీయఫ్‌' పేరుతో ప్రశాంత్‌నీల్‌ రూపొందించిన చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందర్నీ ఎంతగానో ఆకర్షించింది. ఒక రీజనల్‌ ఫిల్మ్‌గా విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. బంగారు గనుల ప్రాంతాన్ని దక్కించుకోవడం కోసం పలువురు వ్యక్తుల మధ్య జరిగిన పోరాటాలను, అందులో పనిచేసే కార్మికుల చీకటి జీవితాలను ఈ సినిమాలో ప్రశాంత్‌నీల్‌ కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమా చూసిన తర్వాత.. 'కేజీయఫ్‌' గురించి అందరూ సెర్చ్‌ చేయడం ప్రారంభించారు. 'కేజీయఫ్‌'లో గతంలో ఇలాంటి పరిస్థితులే ఉండేవా? అని చర్చించుకున్నారు.

KGF
యశ్

దీనిపై ఓ సందర్భంలో చిత్రబృందం స్పందిస్తూ ఇది కేవలం కల్పిత కథేనని.. ఆనాటి కేజీయఫ్‌కు సినిమాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చింది. ఇదిలా ఉండగా, గరుడ మరణం తర్వాత 'నరాచీ'లో ఆధిపత్యం సొంతం చేసుకున్న రాఖీబాయ్‌.. ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు అనేది 'కేజీయఫ్‌-2'లో చూపించనున్నారు. ఈసినిమా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

KGF
'కేజీయఫ్‌2'

ఇవీ చూడండి:

ప్రభాస్​ ఫ్యాన్స్​కు దెబ్బ మీద దెబ్బ.. 'స‌లార్' గ్లింప్స్‌ కూడా..

ఆయన సినిమాలు రీమేక్‌ చేయలేను: యశ్‌

కేజీఎఫ్​ 2: 'ఆ సీన్స్​ను సహజంగా చేయడానికే ప్రాధాన్యం ఇచ్చా'

Last Updated : Apr 10, 2022, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.