ETV Bharat / entertainment

ఆస్కార్ వేడుక.. ఈ అదిరిపోయే విశేషాలు మీకు తెలుసా? - ఆస్కార్ అవార్డులు ఆసక్తికర విషయాలు

మరికొన్ని గంటల్లో మొదలయ్యే 'ఆస్కార్స్' అంగరంగ వైభవంగా జరిగేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ అవార్డుకు ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎప్పుడు మొదలైంది? ఎక్కడెక్కడ జరిగింది? లాంటి ఆసక్తికర విశేషాలు మీకోసం.

interesting fact about oscar awards
interesting fact about oscar awards
author img

By

Published : Mar 12, 2023, 3:19 PM IST

వచ్చేసింది.. ఆస్కార్‌ పండగొచ్చేసింది. తారలను, సినీ ప్రేమికులను ఆనంద డోలికల్లో ముంచెత్తే హాలీవుడ్‌ పెద్ద పండగకు సర్వం సిద్ధమైంది. పదమూడున్నర అంగుళాలుండే పుత్తడి బొమ్మను అందుకోవాలనేది చిత్రపరిశ్రమలోని అందరి కల. ఇది సినిమాకే కళ. ఈ ప్రతిమ అందుకున్నాక.. సూపర్‌ హీరోలను కూడా కంటతడి పెట్టిస్తుంది. తమ సినీ ప్రయాణాన్ని గుండెల్లో ముద్రిస్తుంది. ప్రేక్షకుల కళ్లలో మెరిపిస్తుంది. ఆ బంగరు బొమ్మకున్న విలువ అలాంటిది మరి. ఇది ఈ ఏడాది ఎవరి చేతుల్లోకి వెళ్లి ఎంత భావోద్వేగానికి గురి చేస్తుందో చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ఇంతటి గొప్ప ఆస్కార్‌ వేడుక గురించిన కొన్ని ఆసక్తికర విషయాలివి...

మొదటి వేడుక 15 నిమిషాల్లోనే..
సినీ ప్రపంచంలోని ప్రతిభావంతులకు దక్కే అత్యున్నత పురస్కారం అకాడమీ అవార్డను భావిస్తారు. దీన్నే మనం ఆస్కార్‌ అని పిలుస్తాం. మొదటి ఆస్కార్‌ పండగ జరిగింది మే 16, 1929. ప్రఖ్యాత హాలీవుడ్‌ రూజ్‌వెల్ట్‌ హోటల్‌లో 270 మంది అతిథుల సమక్షంలో అవార్డులు ప్రదానం చేశారు. దర్శకులు, సాంకేతిక నిపుణులకు మొత్తం 15 అవార్డులను అందజేశారు. ఆ వేడుక 15 నిమిషాల్లోనే ముగిసిపోవడం విశేషం. ఆ ఏడాదికి విజేతల వివరాలను మూడు నెలల ముందుగానే మీడియాకు తెలిపారు. కానీ 1930 నుంచి ఆ పద్ధతి మారిపోయింది.

ఒకే అవార్డు వేర్వేరుగా..
మొదటి అకాడమీ వేడుకల్లో ఉత్తమ దర్శకుడి విభాగాన్ని డ్రామా, కామెడీ.. ఇలా రెండుగా విడగొట్టి ప్రత్యేకంగా అవార్డులిచ్చారు. బెస్ట్‌ ఒరిజనల్‌ స్కోర్‌ విభాగంలోనూ ఇలా రెండు రకాలుగా పురస్కారాలు అందేవి. ఆర్ట్‌ డైరెక్షన్‌, సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌లను కూడా 1930ల నుంచి 1960 మధ్య కాలంలో కలర్‌, బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలకు వేర్వేరుగా అవార్డులిచ్చారు.

తడబడి.. తప్పు దిద్దుకొని..
ఇంత భారీ వేడుకలో ఓసారి అవార్డు గ్రహీతల పేర్లు మార్చి తప్పులో కాలేసింది అకాడమీ. 89వ ఆస్కార్‌ వేడుకల్లో 'మూన్‌లైట్‌'కు బదులుగా 'లాలా ల్యాండ్‌'ను ఉత్తమ చిత్రంగా ప్రకటించింది. ఆ తర్వాత తప్పు దిద్దుకొని అసలైన విజేతను ప్రకటించారు.

అట్టహాసంగా వేదిక
లాస్‌ ఏంజిలెస్‌లో హాలీవుడ్‌లోనే పలు మార్లు ఆస్కార్‌ వేదికలు మారాయి. హాలీవుడ్‌ రూజ్‌వెల్ట్‌ హోటల్‌, అంబాసిడర్‌ హోటల్‌, ష్రైన్‌ ఆడిటోరియమ్‌.. ఇలా ఎప్పటికప్పుడు వేదిక మారుతూ వచ్చింది. 1961లో తొలిసారి వేదికను కాలిఫోర్నియాకు మార్చారు. మళ్లీ 1969లో తిరిగి లాస్‌ ఏంజిలెస్‌కు తీసుకొచ్చారు. 1990ల నుంచి 2001 వరకు ష్రైన్‌ ఆడిటోరియమ్‌లోనే వేడుకలు జరగగా 2002 నుంచి ఇప్పుడు లాస్‌ ఎంజిలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో చేయడం మొదలెట్టారు. అప్పటి నుంచి ఈ ఏడాది వరకూ ఈ పసిడి పండగ అక్కడే అట్టహాసంగా జరుగుతోంది.

ఆస్కార్‌నే తిరస్కరించారు
బంగారు బొమ్మను కళ్లకద్దుకు తీసుకునేవారే కాదు, బాహాటంగా తిరస్కరించినవారూ ఉన్నారు. డ్యుడ్లీ నికోల్స్‌ అనే రచయిత అకాడమీకి, రచయితల సంఘానికి వచ్చిన విభేదాల కారణంగా 1935లో అవార్డును తీసుకోలేదు. ఆ తర్వాత మూడేళ్లకు తిరిగి స్వీకరించాడు. ఉత్తమ నటుడి విభాగంలో జార్జ్‌ సి. స్కాట్‌ 1970లో తిరస్కరిస్తే, సినీ పరిశ్రమలోని వివక్షకు వ్యతిరేకంగా గాడ్‌ఫాదర్‌(1972)లో మార్లన్‌ బ్రాండో అవార్డును బహిష్కరించారు.

'ఉత్తమ విదేశీ చిత్రం'లో మనం
ఉత్తమ విదేశీ చిత్రం అవార్డును 29వ అకాడమీ అవార్డుల వేడుకలో అంటే 1957లో ప్రవేశపెట్టారు. ఈ అవార్డు ప్రవేశపెట్టిన మొదటి ఏడాదే మనదేశం నుంచి ‘మదర్‌ ఇండియా’ చిత్రం నామినేట్‌ అయింది. దీనికి అవార్డు దక్కలేదు. ఆ తర్వాత మీరా నాయర్‌ ‘సలాం బాంబే’(1988), ఆమిర్‌ ఖాన్‌ ‘లగాన్‌’ (2001) చిత్రాలు పోటీలో నిలిచాయి. ఇవీ పురస్కారానికి నోచుకోలేదు. ఈ ఏడాది మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ను బరిలోకి దింపినా.. అకాడమీ నుంచి మొండి చేయే ఎదురైంది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగాన్నే ఇప్పుడు ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా మార్చారు. 1957కి ముందు స్పెషల్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు పేరున మాత్రమే బయటి చిత్రాలను గుర్తించేవారు.

భారీ ఏర్పాట్లు..
హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో భారీ ఏర్పాట్ల మధ్య అకాడమీ అవార్డుల ప్రదానం జరగనుంది. జిమ్మీ కిమ్మెల్ మూడోసారి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల ప్రధానోత్సవానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ప్రతి ఏడాది నటీ నటులకు స్వాగతం పలికే రెడ్‌ కార్పెట్‌ స్థానంలో ఈసారి షాంపైన్‌ కార్పెట్‌ను తీర్చిదిద్దుతున్నారు. రెడ్‌ కార్పెట్‌ మీదుగా ఈ షాంపైన్‌ కార్పెట్‌ను వేస్తున్నారు. 1961 తర్వాత మొదటిసారిగా కార్పెట్ ఎరుపు రంగులో కాకుండా షాంపైన్‌ రంగులో ఉండనుంది. వివిధ భాషల నుంచి దాదాపు 300 చిత్రాలు ఆస్కార్‌ పురస్కారాల కోసం షార్ట్‌లిస్ట్ కాగా.. అత్యుత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాల్ని ఓటింగ్ ద్వారా అకాడమీ తుది జాబితాను ఎంపిక చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.