ETV Bharat / entertainment

సూసైడ్​ బాంబర్​ అని నన్ను అరెస్ట్​ చేశారు.. ఇక అయిపోయా అనుకున్నా: సత్యదేవ్​ - సత్యదేవ్​ వార్తలు

ఎటువంటి బ్యాక్​గ్రౌండ్​ లేకుండా పైకొచ్చిన సెల్ఫ్‌మేడ్‌ యాక్టర్‌ సత్యదేవ్‌. చిన్నచిన్న పాత్రల్లో నటించి తన సినిమా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన ఇప్పుడు బాలీవుడ్‌ వరకు వెళ్లారు. ఇటీవల 'గుర్తుందా శీతాకాలం'తో మన ముందుకొచ్చారు. ఈ సందర్భంగా సత్యదేవ్‌ తన జీవితంలోని కొన్ని జ్ఞాపకాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..

satyadev latest news
satyadev latest news
author img

By

Published : Dec 18, 2022, 9:57 AM IST

Updated : Dec 18, 2022, 10:05 AM IST

Actor Satyadev Interesting Facts: ఎటువంటి చెప్పుకోదగ్గ నేపథ్యం లేకుండా చిత్రసీమలో పైకొచ్చిన సెల్ఫ్‌మేడ్‌ యాక్టర్‌... సత్యదేవ్‌. చిన్నాచితకా పాత్రలతో సినిమా ప్రయాణం మొదలుపెట్టి బాలీవుడ్‌ వరకూ వెళ్లాడు. 'గుర్తుందా శీతాకాలం'తో ఇటీవల మన ముందుకొచ్చిన సత్యదేవ్‌ జీవితంలోని కొన్ని జ్ఞాపకాలు అతని మాటల్లోనే..

మర్చిపోలేను
ఓ సినిమా షూటింగ్‌కోసం అఫ్గానిస్తాన్‌ వెళ్లాం. వెళ్లగానే అనుమతి దొరకలేదు. దాంతో ఒకరోజు మమ్మల్నెవరూ గుర్తించకుండా ఉండాలని ఓ ఎత్తైన బిల్డింగ్‌లో కెమెరాలు పెట్టి... కనీసం కొన్ని షాట్స్‌ అయినా తీసుకుందామని ప్లాన్‌ చేశాం. దాంతో డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ ఫోన్‌లో చెబుతుంటే వింటూ నేను అటూ ఇటూ నడుస్తున్నా. నా కదలికలు పోలీసులకు అనుమానాస్పదంగా అనిపించడంతో- సూయి సైడ్‌ బాంబర్‌ని అనుకుని అరెస్ట్‌ చేసి షూట్‌ చేయబోయారు. లక్కీగా పాస్‌పోర్టు చూపించి ప్రాణాలు కాపాడుకున్నా. ఆ రోజు నేను అయిపోయాననే అనుకున్నా. ఇప్పటికీ అది గుర్తొస్తే వణుకొచ్చేస్తుంది.

satyadev latest news
సత్యదేవ్

కొత్త అనుభూతి
చాలామంది నా నటనతోపాటు గొంతు కూడా బాగుందని చెబుతుంటారు. 'నవాబు'లో శింబూకీ, 'సాహో'లో నీల్‌నితిన్‌ ముఖేశ్‌కీ, 'ఆకాశమే హద్దురా'లో సూర్యకీ చెప్పా. అది మాత్రం నాకు కొత్త అనుభూతి అనే చెప్పాలి.

అభిమానం
ఒకసారి హోటల్‌లో భోం చేస్తున్నా. దూరంగా కూర్చున్న ఒకతను నన్నే చూస్తున్నాడు. నన్ను గుర్తుపట్టి చూస్తున్నాడేమో అనుకున్నా. తీరా తిన్నాక బిల్లు అడిగితే 'ఆల్రెడీ కట్టేశారు సర్‌' అన్నాడు వెయిటర్‌. కట్టింది ఎవరో కాదు. నన్ను గమనించిన వ్యక్తే. దగ్గరకు వెళితే ఆయన హైకోర్టు లాయర్‌ అని తెలిసింది. ''మీ 'బ్లఫ్‌మాస్టర్‌' సినిమా చూసి అభిమానినయ్యా. మీకు కడుపునిండా అన్నం పెట్టించిన తృప్తి చాలు నాకు'' అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

satyadev latest news
సత్యదేవ్​

నమ్మలేకపోయా
అన్నయ్య(చిరంజీవి) ఒకరోజు లంచ్‌కి పిలిచారు. వెళ్లాక సినిమా కథ చెబుతున్నారు. ఆయన నాకు కథ చెప్పడం ఏంటని ఆశ్చర్యపోయా. ఆ క్షణం నాకు చాలా గొప్పగా అనిపించింది. అప్పుడే 'గాడ్‌ఫాదర్‌'లో చేయమని అడిగారు. నిజానికి నేను ఆయనకు వీరాభిమానిని. చెబితే నమ్మరేమోగానీ చిన్నప్పుడు అన్నయ్య పాట పెడితేనే అన్నం తినేవాడినట.

ప్రయోగం
'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'లో పాత్ర బాగా పండాలని ఆ సినిమా షూటింగ్‌ జరిగినన్ని రోజులూ నిజంగానే చెప్పుల్లేకుండా తిరిగా. అలానే సీన్‌ బాగా రావాలని ఒక ఫైట్‌ సీన్లో నేనూ, విలన్‌ నిజంగానే కొట్టుకున్నాం. చాలా దెబ్బలు కూడా తగిలాయి.

మాకు స్పెషల్‌
నా భార్య దీపిక. చిన్నప్పటి నుంచీ ఇద్దరం కలిసి చదువుకున్నాం. నటుడిగా నా ఎదుగుదలలో అడుగడుగునా తనుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో ఇంట్లో సమస్యలన్నీ తనే ఎదుర్కొంది. నన్ను ముందుకు నడిపించింది. నాకోసం కొంతకాలం ఉద్యోగం చేసింది. ప్రస్తుతం ఫ్యాషన్‌ డిజైనర్‌గా చేస్తోంది. 'గాడ్‌ఫాదర్‌'లో నా కాస్ట్యూమ్స్‌ తనే డిజైన్‌ చేసింది. మా ఇద్దరికీ ఆ సినిమా చాలా స్పెషల్‌.

satyadev latest news
సత్యదేవ్​ ఫ్యామిలీ

ప్రశంస
'మన ఊరి రామాయణం' సినిమా చూసిన ఇళయరాజా సర్‌ 'ఈ కుర్రాడు బాగా చేశాడు' అని మెచ్చుకున్నారు. అది జీవితంలో మర్చిపోలేని ప్రశంస.

బాలీవుడ్‌ ప్రయాణం
హీరో అనిపించుకోవడం కంటే అన్ని రకాల పాత్రలూ పోషించి మంచి నటుడిగా పేరు తెచ్చుకోవడం నాకిష్టం. చిన్న పాత్రలతో మొదలుపెట్టి హీరోనయ్యా.'రామ్‌సేతు'తో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టా. ఆ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు ఎంతో భయపడ్డా. నటించాక మాత్రం ఎంతో సంతృప్తి కలిగింది.

అదో గుర్తు'కొదమ సింహం'లో హీరో తాడు సాయంతో ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకు వెళుతుంటాడు. అదిచూసిన నేను టీవీ కేబుల్‌ వైరు పట్టుకుని వేలాడేవాడిని. ఒకరోజు కేబుల్‌ తెగి టీపాయ్‌ మీద పడి కనుబొమ పైన గాయమైంది. డాక్టర్‌ వేసిన కుట్లు ఇన్‌ఫెక్ట్‌ అయ్యి మరింత ప్రమాదమైంది. ఆ గుర్తే ఇప్పటికీ నుదుటిమీద ఉంది.

Last Updated : Dec 18, 2022, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.