India's Costliest Web Series: ఈ మధ్య కాలంలో సినిమాలతోపాటు వెబ్‌సిరీస్, డాక్యుమెంటరీలు చూసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆడియెన్స్‌ను దృష్టిలో ఉంచుకొని మేకర్స్ కూడా ఈ షార్ట్ ఫిల్మ్స్, వెబ్‌సిరీస్‌లు ఎక్కువగానే చేస్తున్నారు. ఇక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల్లో స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం ఉండడం వల్ల వెబ్‌సిరీస్‌లపై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపుతున్నారు.
ఓటీటీల్లో మనకు కావాల్సిన సినిమా/వెబ్‌సిరీస్ ఎప్పుడంటే అప్పుడే చూడొచ్చు. అందుకే వీటికి ఆడియెన్స్‌లో వీటికి క్రేజ్ ఎక్కువవుతోంది. రోజూ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు OTTలో విడుదలవుతున్నాయి. కామెడీ, హర్రర్, ఎమోషన్స్, డ్రామా, యాక్షన్లాంటి జానర్లలో ఈ వెబ్‌సిరీస్‌లు రూపొందుతున్నాయి. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఇప్పటికే అనేక వెబ్‌సిరీస్‌లు వచ్చాయి.
ఒక కథను ఎపిసోడ్లుగా విభజించి తీసేదే వెబ్‌సిరీస్. అయితే ఈ ఎపిసోడ్ల రన్‌టైమ్ 15నిమిషాల నుంచి 30నిమిషాల మధ్యలో ఉంటుంది. కథను బట్టి ఈ సమయంలో మార్పు ఉంటుంది. అయితే ఎలాంటి వెబ్‌సిరీస్ అయినా రూ.లక్షల్లో ఖర్చుతోనే రూపొందించవచ్చు. కానీ, ఓ బాలీవుడ్ వెబ్‌సిరీస్‌కు మాత్రం రూ.కోట్లు ఖర్చయింది. అంతే కాదు దాని బడ్జెట్ మొత్తం కలిపితే రెండు బాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువైంది.
2022లో 'రుద్ర - ది ఏజ్ ఆఫ్ డార్క్నెస్' అనే బాలీవుడ్ వెబ్‌సిరీస్ విడుదలైంది. ఈ సిరీస్‌లో స్టార్ నటుడు అజయ్ దేవ్గన్, రాశీ ఖన్నా, ఇషా దేవోల్, అతుల్ కులకర్ణి, అశ్విని కల్సేకర్, ఆశిష్ విద్యార్థి నటించారు. డైరెక్టర్ రాజేష్ మపుస్కర్ సైకలాజికల్ క్రైమ్, డ్రామా మిస్టరీ జానర్లో ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇది బ్రిటిష్ షో 'లూథర్'కి హిందీ రీమేక్. ఈ సిరీస్ ప్రముఖ సినిమా, వెబ్‌సిరీస్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ ఐఎమ్‌డీబీ (IMDB)లో 10కి 6.7 రేటింగ్‌ను పొందింది.
అయితే ఈ వెబ్‌సిరీస్ దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో రూపొందినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన బాలీవుడ్లో రీసెంట్గా రిలీజైన సన్నీ దేవోల్ గదర్-2 (రూ.60కోట్లు), షారుక్ ఖాన్ డంకీ (రూ.85కోట్లు), రణబీర్ కపూర్ యానిమల్ (రూ.100కోట్లు) సినిమాల కంటే ఈ వెబ్సిరీస్కే ఎక్కువ ఖర్చు అయ్యింది. కాగా, ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్ దక్కించుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
OTT లవర్స్‌కు సరికొత్తగా ETV WIN.. 'ఒక్క రూపాయి'కే బ్లాక్ బాస్టర్ సినిమాలు, సిరీస్‌లు