Indian 2 Shooting : లోక నాయకుడు కమల్ హాసన్.. స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'ఇండియన్ 2'. 90స్లో బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న 'ఇండియన్-1'కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఇప్పటికే పలు మార్లు ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడగా.. తాజాగా మరో షెడ్యుల్‌తో శంకర్ టీమ్ రంగంలోకి దిగనుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ విజయవాడలో జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే శంకర్ కొన్ని లొకేషన్స్‌ను ఖరారు చేశారని సమాచారం.
దాదాపు పదిరోజుల పాటు సాగే ఈ చిత్రీకరణలో కమల్‌తో పాటు ఇతర నటీనటులు పాల్గొననున్నారట. ఇక్కడే శంకర్ ఓ క్రేజీ సీక్వెన్స్‌ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారట. ఇక ఈ షూటింగ్ కోసం సుమారు 8000 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లను తీసుకున్నట్టు సమాచారం. ఇక విజయవాడ షెడ్యూల్ తర్వాత వైజాగ్‌లో కూడా కొంత షూటింగ్ జరుగుతుందని సమాచారం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Indian 2 Movie Cast : ఇక ఇండియన్-2 సినిమా విషయానికి వస్తే.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ప్రియా భవాని, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సుభాస్కరణ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు, రవి వర్మ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Indian 2 Movie Shooting : ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూటింగ్.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కానీ అన్నీ అడ్డంకులను అధిగమించి ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా పూర్తవుతోంది. అయితే ఓ వైపు ఈ సినిమా కంప్లీట్ అవుతోందని కమల్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటుంటే.. మరోవైపు చెర్రీ ఫ్యాన్స్ మాత్రం కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. 'గేమ్ ఛేంజర్' సినిమా విషయంలో శంకర్ ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడమే దీనికి కారణం.
'ఇండియన్ 2' లేట్ అవుతుండటం వల్ల రామ్ చరణ్ తో 'గేమ్ ఛేంజర్' సినిమాను పట్టాలెక్కించారు శంకర్. అయితే మళ్లీ కమల్ హాసన్ సినిమా షూటింగ్ ప్రారంభించి.. రెండు సినిమాల పనులను చూసుకుంటూ వచ్చారు. దీంతో రామ్ చరణ్ సినిమా గురించి ఎటువంటి బజ్ బయటకి రావడం లేదు. 'గేమ్ ఛేంజర్' నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమా గురించి ఏదైనా శంకర్‌నే అడగాలని చెబుతున్నారు. అంతే కాకుండా ఎప్పటికప్పుడు కంటెంట్ లీక్ అవుతుండటం వల్ల కూడా మెగా అభిమానులను ఆందోళ చెందుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ.. ఇప్పుడైనా 'గేమ్ ఛేంజర్' సినిమా గురించి అప్డేట్ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
'ఇండియన్-2' ఇంట్రో రిలీజ్, 'భారతీయుడుకు చావే లేదు' అంటున్న కమల్
మరణించిన నటులు తిరిగి తెరపైకి.. 'భారతీయుడు- 2'లో సూపర్ టెక్నాలజీ