ETV Bharat / entertainment

ఒక్క ఎపిసోడ్​కు రూ.18 కోట్లు- ఓటీటీలో అత్యధిక రెమ్యునరేషన్​ అందుకుంటున్న స్టార్ ఎవరో తెలుసా? - ఇండియా ఓటీటీ ప్లాట్​ఫామ్​

Highest Paid OTT Star In India : ఓటీటీలలో నటించేందుకు బడా స్టార్ట్స్ ఆసక్తి చూపిస్తున్నారు . సిపాత్ర చిన్నదైనా, పెద్దైనా సరే నటించడానికి రెడీ అంటున్నారు. సినిమాలకు సరిసమానంగా పారితోషికాన్ని అందుకుంటున్నారు. ఓటీటీలో అత్యధిక పారిశోషకం తీసుకుంటున్నది ఎవరో చూద్దాం.

Highest Paid OTT Star In India
Highest Paid OTT Star In India
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2023, 7:08 AM IST

Updated : Dec 31, 2023, 9:16 AM IST

Highest Paid OTT Star In India : గత కొంత కాలం నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఎప్పటినుంచో ఈ వెబ్​ కంటెంట్ ఉన్నప్పటికీ కొవిడ్​ కారణంగా ఈ ప్లాట్​ఫామ్స్​కు మరింత డిమాండ్​ పెరిగింది. ఆ సమయంలో థియేటర్లు మూతపడటం కూడా ఈ ఓటీటీల వైపు ఆడియెన్స్​ మొగ్గు చూపించేందుకు ఓ కారణమయ్యింది. అలా మొదలైన ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో మూవీ టీమ్​ కూడా థియేటర్​ ఆడియెన్స్​తో పాటు నెటిజన్లను దృష్టిలో పెట్టుకుని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఓటీటీల ప్రాధాన్యతను గుర్తించిన బడా స్టార్స్ కూడా ఓటీటీ సినిమాలు, వెబ్​సిరీసుల్లో నటించేందుకు ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు. అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్, తమన్నా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సోనాక్షి సిన్హా, సమంత, నాగ చైతన్య, రాశీఖన్నా, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్​ వంటి స్టార్స్ ఓటీటీ వేదికలపై తళుక్కుమంటున్నారు.

మరోవైపు నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, అమెజాన్​ ప్రైమ్​, జియో సినిమా వంటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్​ఫామ్స్​ భారత్​లో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లుగా మెరుస్తున్నాయి. కొత్త సినిమాలను కొనుగోలు చేసుకోవడమే కాకుండా సొంత కంటెంట్​ను ప్రొడ్యూస్​ చేస్తూ నెట్టింట సందడి చేస్తున్నాయి. దీంతో నిర్మాతలు కూడా తమ సినిమా, సిరీస్​లకు అగ్ర తారల మెరుపులు కావాలంటున్నారు. దీంతో ఆయా స్టార్స్​ కూడా సినిమాలకు సరిసమానంగా వెబ్​ దునియాలోనూ మంచి పారితోషికాన్ని అందుకుంటున్నారు.

పాత్ర చిన్నదైనా, పెద్దైనా సరే నటించడానికి రెడీ అంటున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఓటీటీలపై ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. 2022లో డిస్నీ+ హాట్‌ స్టార్‌లో ప్రసారమైన క్రైమ్ థ్రిల్లర్ షో 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్'తో అజయ్ ఓటీటీ తెరంగేట్రం చేశారు. ఇక ప్రస్తుతం ఓటీటీ ఫీల్డ్​లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు కూడా అజయ్ దేవగనే. 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్' 7 ఎపిసోడ్‌ల కోసం ఆయన రూ.125 కోట్లు పారితోషికం తీసుకున్నారని బాలీవుడ్ వర్గాల టాక్. ఒక్క ఎపిసోడ్‌కు రూ. 18 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అలా ఇక ఓటీటీ ప్లాట్​ఫామ్​లో అత్యధిక పారితోషికాన్ని అందుకున్న భారతీయ నటుడుగానూ అజయ్ నిలిచారు. ఇక ఈ ఫీల్డ్​లో బాగా పాపులర్ అయిన మరొక నటుడు మనోజ్ వాజ్‌పేయి. ఈయన అమేజాన్ ప్రైమ్​ వేదికగ విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'లో నటించారు. ఇందులో ఆయన శ్రీకాంత్ తివారీ అనే కీలక పాత్రను పోషించారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' రెండవ సీజన్‌లో మనోజ్ వాజ్‌పేయి రూ. 10 కోట్ల వరకు తీసుకున్నారని టాక్ నడుస్తోంది.

రూ.50 లక్షల బడ్జెట్​.. రూ. 2000 కోట్లకు పైగా కలెక్షన్స్​.. సెన్సేషనల్​ రికార్డ్​ సృష్టించిన ఈ సినిమా చూశారా?

సౌత్​లో రికార్డు సృష్టించిన ఏకైక బాలీవుడ్ సినిమా ఏదంటే?

Last Updated : Dec 31, 2023, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.