Hrithik Roshan Saba Azad: ముంబయిలో జరిగిన కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. రూమర్లను నిజం చేస్తూ తొలిసారి తన గర్ల్‌ఫ్రెండ్ సబా ఆజాద్‌తో కలిసి పార్టీకి వచ్చాడు. నల్ల రంగు దుస్తుల్లో చేతిలో చేయి వేసి ఈ జోడీ నడిచొస్తుంటే చూడముచ్చటగా ఉంది. అనంతరం ఇద్దరూ కెమెరాలకు ఫోజులిచ్చారు. ఈ పార్టీకి వచ్చిన వారందరికీ సబా ఆజాద్‌ను పరిచయం చేశాడు హృతిక్. పార్టీలో విరిద్దరే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఫిబ్రవరిలో ఓ విందుకు హాజరైనప్పటి నుంచి హృతిక్, సబా రిలేషన్లో ఉన్నారని రూమర్లు మొదలయ్యాయి. ఆ తర్వాత హృతిక్ ఫ్యామిలీ గెట్ టుగెదర్‌కు కూడా సబా వెళ్లింది. అయితే ఇప్పటివరకు ఇద్దరూ తమ రిలేషన్‌షిప్‌పై నోరువిప్పలేదు. కానీ పార్టీలకు కలిసి హాజరవ్వడం చూస్తుంటే ఇది నిజమనే అర్థమవుతోంది.
మరోవైపు కరణ్ జోహార్ బర్త్‌డే పార్టీకి హృతిక్ మాజీ భార్య సుసేన్ ఖాన్ కూడా హాజరైంది. ఆమె రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ అర్స్లాన్ గోనితో కలిసి పార్టీకి వచ్చింది.
ఇదీ చదవండి: ఉగ్ర కాల్పుల్లో టీవీ నటి మృతి.. బంధువుకు గాయాలు..!