ETV Bharat / entertainment

గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న 'ఫైటర్‌' ట్రైలర్‌ - గాల్లో యాక్షన్‌ సీన్స్ అదిరింది - హృతిక్ రోషన్ దీపికా పదుకొణె

Hrithik Roshan Fighter Movie Trailer : హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఫైటర్' ట్రైలర్ విడుదలైంది. పక్కా యాక్షన్ మోడ్​లో వచ్చిన ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న 'ఫైటర్‌' ట్రైలర్‌ - గాల్లో యాక్షన్‌ సీన్స్ అదిరింది

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 3:38 PM IST

Updated : Jan 15, 2024, 5:01 PM IST

Hrithik Roshan Fighter Movie Trailer : సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఫైటర్‌'(Fighter Movie). పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంగా ఇది రూపొందింది. అనిల్‌ కపూర్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం జనవరి 25న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ ఆడియెన్స్​లో భారీ స్థాయిలో అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది మూవీటీమ్​. గాల్లో యాక్షన్‌ సన్నివేశాలు, దేశభక్తి ఉట్టిపడేలా ఉన్న ఈ ప్రచార చిత్రం గూస్‌బంప్స్‌ తెప్పిస్తోంది. మీరూ చూసేయండి.

ఇకపోతే ఈ ప్రచార చిత్రంలో విజువల్స్ హాలీవుడ్ రేంజ్​లో ఉన్నాయి. ఈ చిత్రంలో హృతిక్, దీపిక, అనిల్ కపూర్- ఫైటర్ జెట్ పైలట్స్​గా నటించారు. ఇంకా ఈ చిత్రంలో కరణ్ సింగ్ గ్రోవర్‌, అక్షయ్‌ ఒబెరాయ్‌, సంజీదా షేఖ్‌, తలత్‌ అజిజ్ ఇతర కీలక పాత్రలు నటించారు. యాక్షన్ ఇంటెన్స్ సన్నివేశాలు, పాకిస్థాన్ పై, టెర్రరిస్టులపై అటాక్ సీన్స్, దేశభక్తి ఎమోషన్​తో సైనికుల విన్యాసాలు, హృతిక్- దీపిక రొమాన్స్ ఇలా అన్ని అంశాలను ట్రైలర్​లో చూపించి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశారు. 2024 జనవరి 25న రిపబ్లిక్ డే కానుకగా మూవీ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. పఠాన్ తర్వాత సిద్దార్థ్‌ ఆనంద్ కాంపౌండ్‌ నుంచి వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో సిద్దార్థ్ ఆనంద్ హ్యాట్రిక్ కొడతారని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. పుల్వామా అటాక్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఏరియల్ యాక్షన్​తో తెరకెక్కుతున్న తొలి భారతీయ సినిమా ఇది. అలానే హృతిక్ రోషన్ నుంచి వస్తున్న తొలి 3డీ చిత్రం కూడా ఇదే కావడం విశేషం. మూవీని 3డీ ఐమాక్స్ ఫార్మాట్​లో రూపొందించారు. చిత్రాన్ని వయాకామ్‌ 18 స్టూడియోస్‌ - మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఇకపోతే ఫైటర్ ట్రైలర్ విడుదల సందర్భంగా హీరో హృతిక్ రోషన్ ప్రేక్షకులకు అభిమానులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మెగా ఫ్యామిలీ ఫుల్‌ ఫొటో - స్పెషల్ అట్రాక్షన్​గా అకీరా, ఆద్యా

'నా సామి రంగ' ఫస్ట్ డే కలెక్షన్స్​ - ఊహించిన దాని కన్నా ఎక్కువగా!

Last Updated : Jan 15, 2024, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.