ETV Bharat / entertainment

'కేజీయఫ్'​ నిర్మాతలతో కీర్తి సురేశ్​​ భారీ ప్రాజెక్టు.. కాంబో అదిరిందిగా! - హోంబ్లే సినిమాల్లో కీర్తి సరేష్​​

టాలీవుడ్​ అందాల భామ కీర్తి సురేశ్​ మరో లేడీ ఓరియెంటెడ్​ సినిమా చేయనున్నారు. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించనున్న తొలి తమిళ చిత్రంలో నటించనున్నారు. ఆ వివరాలు..

Hombale Films
కీర్తి సురేష్
author img

By

Published : Dec 4, 2022, 7:13 PM IST

Hombale Films First Tamil Film: టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్ కీర్తి సురేశ్​ కొత్త సినిమా ప్రకటించారు. కేజీయఫ్ నిర్మాతలతో భారీ ప్రాజెక్టు చేయనున్నారు. 'రఘు తాథ' టైటిల్​తో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించనున్నారు. ఈ చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీతో ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్నట్లు సమాచారం. హోంబలే ఫిల్మ్స్‌ తొలి తమిళ చిత్రం ఇదే కావడం విశేషం. హోంబలే ఫిల్మ్స్​ విడుదల చేసిన పోస్టర్​లో కీర్తి సురేశ్​​ లుక్ అదిరిపోయింది. సినిమాలో ఆమె పోరాట యోధురాలిగా కనిపించనున్నారని తెలుస్తోంది. పోస్టర్​పై ఉన్న 'ఉద్యమం ఇంటి నుంచే మొదలవుతుంది' కోట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

సినిమాలతో ఫుల్​ బిజీగా ఉన్న కీర్తి సురేశ్​ ఖాతాలో మరో లేడీ ఓరియోంటెడ్​ సినిమా చేరింది. అలనాటి నటి సావిత్రి బయోపిక్​గా తెరకెక్కిన మహానటి సినిమాలో కీర్తి తన నటన అబ్బురపరిచింది. ఆమెకు జాతీయ అవార్డు కూడా దక్కింది. అప్పటి నుంచి కీర్తి వరుసగా పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం కీర్తి తెలుగులో 'భోళా శంకర్', దసరా సినిమాల్లో నటిస్తున్నారు. చిరంజీవి-మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కుతోన్న ఆ చిత్రంలో చిరు చెల్లి పాత్ర చేస్తున్నారు. హీరో నానికి జోడీగా నటించిన 'దసరా' చిత్రంపై భారీ అంచానాలు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.