Hollywood Villian Jack Nicholson Remuneration : సినిమా అనగానే మొదట అందరి దృష్టి హీరోపైనే ఉంటుంది. డైరెక్టర్ సినిమా అనౌన్స్ చేయగానే హీరో ఎవరు అని సినీప్రియులు ఆసక్తిగా ఇంటర్నెట్లో వెతికేస్తుంటారు. ఆ తర్వాతే హీరోయిన్ గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఇక విలన్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే కథంతా హీరో పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి. ఇక అప్పుడప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ.. హీరోయిన్లు కూడా మంచి తెచ్చుకుంటున్నారు.
పారితోషికం విషయానికొస్తే.. స్టార్‌డమ్‌ను బట్టి ఆయా హీరోల పారితోషికం భారీగానే ఉంటుంది. ఆ తర్వాత డైరెక్టర్, హీరోయిన్లకు.. నిర్మాతలు ఎక్కువ మొత్తం చెల్లిస్తారని మనం చాలా సార్లు విన్న సందర్భాలున్నాయి. కానీ విలన్‌తో సహా.. సినిమాలోని ఇతర నటీనటులకు రెమ్యూనరేషన్ లక్షల్లోనే ఉంటుందని అంచనా. అయితే హీరో పాత్ర బాగా పండాలంటే ప్రతినాయకుడు పాత్ర కీలకం. విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే.. హీరో అంతగా హైలైట్ అవుతాడు. అయితే విలన్లకు పారితోషికం తక్కువగానే అందుతుంది.
ఈ విలన్ ఛార్జ్.. హీరోల కంటే ఎక్కువే.. అయితే ఒక విలన్ మాత్రం హీరోల కంటే ఎక్కువ సంపాదించి రికార్డుకెక్కారు. ఆయనే హాలీవుడ్ నటుడు 'జాక్ నికల్సన్'. దాదాపు 34 సంవత్సరాల కిందట ఆయన ఒక్క సినిమాతో రూ. 150 కోట్లు ఆర్జించారట. ఆయన విలన్ పాత్రలో నటించిన 'బ్యాట్‌మ్యాన్' సినిమాకుగాను ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్నారు. ఈ సినిమాలో 'మైఖేల్ కీటన్' అనే హాలీవుడ్ హీరో లీడ్ రోల్ ప్లే చేయగా.. ఆయనకు ప్రధాన శత్రువైన జోకర్ పాత్రలో జాక్ నికల్సన్ నటించి ప్రేక్షకులను అలరించారు.
అయితే ఈ సినిమా విడుదల సమయంలో హీరో మైఖేల్ కీటన్‌కు అంతగా ప్రజాదరణ లేదు. కామెడీ సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఆయన సినిమాలకు.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు వచ్చే అవకాశం లేదు. ఈ కారణంగా మైఖేల్ కీటన్ రెమ్యూనరేషన్ రూ.కోటి రూపాయలే ఉండేదట. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన జాక్ నికల్సన్‌కి.. అప్పటికే విపరీతంగా ప్రజాకర్షణ ఉంది. దీంతో 'బ్యాట్‌మ్యాన్' మంచి విజయం సాధించింది. ఇక నికల్సన్‌కు రెమ్యూనరేషన్‌తో పాటు సినిమా లాభాల్లో వాటా కూడా ఇచ్చారు. ఈ సినిమాకు రాయల్టీ రూపంలో నికల్సన్ 1995 నాటికి రూ.150 కోట్లకుపైగా పొందారు. దీంతో ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా టాప్‌లో నిలిచారు.
అమ్మ బాబోయ్.. ఫ్లైట్ జర్నీ కన్నా ఈ సినిమా టికెట్ ధరే ఎక్కువ!