ETV Bharat / entertainment

8 గంటలకు రూ.800.. ఆ ప్రశ్నకు సమంత​ రిప్లై! - హీరోయిన్ సమంత రాబోయే సినిమాలు

టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్లలో సమంత ఒకరు. నాగ చైతన్యతో విడాకుల అనంతరం కెరీర్‌లో స్పీడ్‌ పెంచిన ఆమె.. వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ.. బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అభిమానులతో ముచ్చటించిన సామ్​.. తన తొలి సంపాదన గురించి ఆసక్తికరమైన విషయాన్ని తెలిపింది. దీంతో పాటే విజయ్​సేతుపతి, నయన్​తో తనకున్న అనుబంధాన్ని వివరించింది.

Heroine Samatha First Salary
Heroine Samatha First Salary
author img

By

Published : Apr 18, 2022, 1:03 PM IST

Samantha First Salary: 'ఏమాయ చేశావే' సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన హీరోయిన్​ సమంత ఇప్పటికీ తన నటనతో అభిమానుల్ని మాయ చేస్తూనే ఉన్నారు. వచ్చినా ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకొని తనలోని ప్రతిభను ప్రదర్శిస్తూ.. స్టార్ హీరోయిన్​గా వెలుగొందుతున్నారు. ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్ట్​ల్లో నటిస్తూ కెరీర్​లో దూసుకెళ్తున్నారు. అందులో 'కాతు వాకులా రెండు కాదల్' ​ఒకటి. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా సోషల్​మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ఈ ముద్దుగుమ్మ.. తనకు సంబంధించిన పలు ఆసక్తికర సంగతులను తెలిపారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు తన తొలి సంపాదన గురించి చెప్పారు. రూ.500రూపాయలు తీసుకున్నట్లు గుర్తుచేసుకున్నారు

"నా తొలి జీతం రూ.800. ఓ కాన్ఫరెన్స్​ కోసం హోటల్​ 8 గంటల పాటు హోస్ట్​గా వ్యవహరించాను. అయితే అప్పుడు 10 లేదా 11వ తరగతి.. ఏమి చదువుతున్నానో సరిగ్గా గుర్తులేదు." అని సామ్​ పేర్కొన్నారు. ఇక విజయ్​ సేతుపతి గురించి ఓ హార్ట్ సింబల్​ను షేర్​​ చేయగా.. నయనతారను భావోద్వేగంతో హగ్​ చేసుకున్న వీడియోను పోస్ట్ చేశారు. 'నయన్​ గొప్ప నటి. 'కాతువాకులా రెండు కాదల్​'లో ఆమెను చూసేందుకు ఎదురుచూస్తున్నా.' అని నయన్​ గురించి చెప్పారు.

కాగా, సామ్​ విషయానికొస్తే.. ఆమె ఓ సామాన్య కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చారు. కాలేజీలో చదివే రోజుల్లో మోడలింగ్​ చేస్తూ పాకెట్‌ మనీ కోసం ఫంక్షన్‌ హాల్‌లో పనిచేశారని తెలిసింది. అలా 2010లో సినీ రంగంలోకి అడుగుపెట్టి.. ఇప్పటికీ అందర్నీ మాయ చేస్తూనే ఉన్నారు. ప్రతి సినిమాను మొదటి చిత్రంగా భావించడం, ఛాలెంజ్‌ను స్వీకరించడమే తన విజయ రహస్యమని గతంలో పలు సందర్భాల్లో చెప్పారు.

ఇటీవల 'పుష్ప'లో ఐటమ్‌ సాంగ్‌లో అదరగొట్టిన సామ్​.. ప్రస్తుతం 'కాతు వాకులా రెండు కాదల్'​తో పాటు 'శాకుంతలం', 'యశోద' చిత్రాల్లోనూ నటిస్తున్నారు. వీటితో సహా 'ది అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌' అనే ఇంటర్నేషనల్ మూవీ.. వరుణ్‌ ధావన్‌తో కలిసి అమెజాన్‌ ప్రైమ్‌ సిరీస్‌ 'సిటాడెల్‌'(Citadel)లోనూ నటిస్తున్నారు.

ఇదీ చూడండి: వయసేమో 40 ప్లస్​.. కానీ ఫిగర్​ చూస్తే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.