'స్వయంవరం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి లయ. కేవలం ఫ్యామిలీ తరహా పాత్రలతోనే అభిమానుల మనసు దోచుకున్నారు. ఆ తర్వాత మా బాలాజీ, మనోహరం, మనసున్న మారాజు, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, మిస్సమ్మ వంటి సినిమాల్లో హీరోయిన్గా మెప్పించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నటించి అలరించారు.
ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. కానీ ఆ మధ్యలో 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రంలో కనిపించారు. ఇక సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫొటోలను పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తన కూతురు శ్లోక ఫోటోను షేర్ చేశారు. ఇందులో కూతురిని ముద్దాడుతూ కనిపించారు. ఈ ఫోటోలో లయ కంటే అందంగా, కళగా ఆమె ఉన్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇద్దరూ ట్రెడిషనల్‌గా, నిండైన సంప్రదాయంతో ఉన్నారని అంటున్నారు.
ప్రస్తుతం చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న నటి ప్రగతితో కూడా సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటారు. కామెడీతో పాటు జిమ్ వీడియోను పెడుతూ నెటిజన్లను అలరిస్తుంటారు. అయితే తాజాగా ఆమె కూడా తన కూతురు ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అది కూడా ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి నటీమణుల కూతుర్లు ఎలా ఉన్నారో చూసేయండి...
ఇదీ చూడండి: పవర్‌ఫుల్‌గా 'గాడ్‌ఫాదర్' ట్రైలర్.. చిరు యాక్షన్ అదరగొట్టేశారుగా