ETV Bharat / entertainment

నా సినిమా కోసం మళ్లీ మళ్లీ అలానే చేస్తా: విశ్వక్​ సేన్​ - విశ్వక్​ సేన్​ క్షమాపణలు

Viswaksen Prank video: తాను చేసిన ప్రాంక్ వీడియోపై స్పందించారు హీరో విశ్వక్​సేన్​. కేవలం చిత్ర ప్రచారం కోసం మాత్రమే ఆ వీడియో చేసినట్లు వివరించారు. అందులో ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చారు.

Viswak Sen says sorry
విశ్వక్​ సేన్​ ప్రాంక్​ వీడియో క్షమాపణలు
author img

By

Published : May 3, 2022, 1:13 PM IST

Viswaksen Prank video: 'అశోకవనంలో అర్జునకళ్యాణం' చిత్ర ప్రచారం కోసం చేసిన ప్రాంక్ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ చిత్ర కథానాయకుడు విశ్వక్ సేన్ స్పందించారు. కేవలం చిత్ర ప్రచారం కోసం మాత్రమే ఆ వీడియో చేశామని, ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చారు. మే 6న అర్జున కళ్యాణం విడుదల సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేకంగా సమావేశమై ఆ చిత్ర విశేషాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఇటీవల జరిగిన వివాదాలపై వివరణ ఇచ్చిన విశ్వక్ సేన్... ఓ టీవీ ఛానల్ యాంకర్ తో జరిగిన విభేదాలకు సంబంధించి బుధవారం ప్రత్యేక వీడియో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. సినిమాను జనాలకు చేరువ చేసేందుకు మాత్రమే తాను ప్రయత్నాలు చేస్తాను తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి దురుద్దేశం లేదని విశ్వక్ సేన్ తెలిపారు.

ప్రాంక్​ వీడియోపై విశ్వక్​ సేన్​ స్పందన

కాగా, ఈ చిత్రంలో విశ్వక్‌సేన్‌, రుక్సార్‌ థిల్లాన్‌ జంటగా నటించారు. విద్యాసాగర్‌ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌.. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పెళ్లి చూపులకని గోదావరి జిల్లాలోని ఓ ఊరికి వెళ్లి 33ఏళ్ల అర్జున్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఆడ పెళ్లి వాళ్ల నుంచి ఎలాంటి మర్యాదలు అందాయి? అనుకోని పరిస్థితుల్లో పెళ్లి ఎందుకు క్యాన్సిల్‌ చేసుకోవాల్సి వచ్చింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఇదీ చూడండి: 'మీడియా పేరుతో ఆమె బెదిరించింది.. బాధ కాస్తా భయంగా మారింది!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.