ప్రముఖ హీరో శ్రీ విష్ణు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న ఆయన.. ఆరోగ్యం మరింత క్షీణించిందట. ప్లేట్ లేట్స్ బాగా పడిపోయాయని సమాచారం. ఈ క్రమంంలో శ్రీ విష్ణుని మెరుగైన చికిత్స కోసం.. కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారట. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారట. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
‘బ్రోచేవారెవరురా’, ‘రాజ రాజ చోర’, ‘అర్జున ఫల్గుణ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు శ్రీ విష్ణు. ఇటీవల ‘భళా తందనాన’ సినిమాతో అలరించారు. ప్రస్తుతం ఆయన చేతితో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: 'వామ్మో మైక్ టైసన్.. నా బిడ్డకు దెబ్బలు తగులుతాయ్'.. విజయ్ దేవరకొండ తల్లి ఆందోళన