ETV Bharat / entertainment

హీరో సిద్ధార్థ్ కొత్త మూవీ.. చిరు '154' లేటెస్ట్​ అప్డేట్​ - మెగా 154 సినిమా

Latest Movie Updates: సినీ అప్డేట్స్​ వచ్చేశాయి. ఇందులో నటుడు సిద్ధార్థ్​ కొత్త చిత్రం, చిరంజీవి 'మెగా 154', రామ్​ 'ది వారియర్'​ సహా పలు సినిమాల సంగతులు ఉన్నాయి

CINEMA UPDATES
CINEMA UPDATES
author img

By

Published : Apr 19, 2022, 4:52 PM IST

Hero Siddarth New Movie: నటుడు సిద్ధార్థ్‌ చిన్న గ్యాప్‌ తీసుకుని మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. బహుభాషా నటుడైన సిద్ధార్థ్​ ఇటాకీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ తాజాగా నిర్మిస్తున్న త్రిభాషా చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఎస్‌యూ అరుణ్‌ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకుడు. అయితే ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు.

CINEMA UPDATES
హీరో సిద్ధార్థ్​ కొత్త చిత్రం

Ram The Warrior Movie Song Release: రామ్​ పోతినేని నటిస్తున్న కొత్త చిత్రం ది వారియర్​. ఈ సినిమా నుంచి 'బుల్లెట్' లిరికల్ వీడియో సాంగ్​​ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 22వ తేదీన సాయంత్రం 5:45 నిమిషాలకు 'బుల్లెట్' సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో.. నదియా, భారతీరాజా ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. జూలై 14వ తేదీన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.

CINEMA UPDATES
రామ్​ 'ది వారియర్​'

Mega 154 Movie Latest Update: 'మెగా 154' చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చారు హీరోయిన్ శ్రుతిహాసన్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజ రవితేజ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్‌కు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ మొదలై శరవేగంగా సాగుతోంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా శ్రుతిహాసన్​ నటిస్తున్నారు. తాజాగా ఆమె షెడ్యూల్‌లో జాయిన్ అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అప్‌డేట్ ఇచ్చారు.

ూ
'మెగా 154' శ్రుతిహాసన్​

Ranveer Singh Jayesh Jordar Trailer: రణ్‌వీర్‌సింగ్‌ హీరోగా దివ్యాంగ్‌ థక్కర్‌ తెరకెక్కించిన చిత్రం 'జయేష్‌భాయ్ జోర్దార్'. షాలినీ పాండే కథానాయిక. ఈ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేసింది. మద్యం సేవించి కొందరు బాలురు ఇబ్బంది పెడుతున్నారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఓ బాలిక సర్పంచ్‌కు విన్నవించే సీన్‌తో ప్రారంభమైన ఈ వీడియో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. సర్పంచ్‌గా బొమన్‌ ఇరానీ, ఆయన కొడుకు జోర్దార్‌గా రణ్‌వీర్‌, కోడలిగా షాలినీ కనిపించారు. ఊరందరికీ తీర్పునిచ్చే ఆ సర్పంచ్‌.. తన కొడుక్కి రెండోసారి ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే ఏం చేశాడు? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందినట్టు, నవ్వులు పంచుతూనే సందేశం ఇవ్వబోతున్నట్టు ట్రైలర్‌లోని సన్నివేశాలు తెలియజేస్తున్నాయి. మనీషా శర్మ నిర్మించిన ఈ చిత్రానికి విశాల్‌- శేఖర్‌ సంగీతం అందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: గోల్డెన్ టెంపుల్​లో ఉపాసన.. లంగర్ ఏర్పాటు చేసిన చెర్రీ

ప్రభాస్​ 'సలార్​' లుక్ లీక్​.. 'ఆచార్య'లో కాజల్​ సీన్స్​కు కత్తెర!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.