ETV Bharat / entertainment

పెళ్లైన పదేళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ.. అసలు కారణం చెప్పిన ఉపాసన! - ఉపాసన డెలివరీ

మెగా కోడలు ఉపాసన.. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ నేపథ్యంతో ఆమె.. తన ప్రెగ్నెన్సీకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. పెళ్లైన అయిన పదేళ్ల తర్వాత ఆలస్యంగా తాను గర్భం దాల్చడం వెనుక కారణాన్ని కూడా వెల్లడించారు. అదేంటంటే?

hero ramcharan wife upasana-responds-on-late-pregnancy

author img

By

Published : Apr 3, 2023, 10:36 PM IST

మెగా కపుల్​ రామ్‌చరణ్‌ - ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన తన ప్రెగ్నెన్సీపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వివాహం అయిన పదేళ్ల తర్వాత ఆలస్యంగా తాను గర్భం దాల్చడం వెనుక కారణాన్ని కూడా వెల్లడించారు. సమాజం నుంచి తనకు ఎలాంటి ఒత్తిడి ఎదురైందో కూడా వివరించారు. అయితే గర్భం దాల్చడం ఎంత గర్వంగా ఉందని తెలిపారు.

"సమాజం కోరుకున్నప్పుడు కాకుండా నేను తల్లిని కావాలనుకున్నప్పుడు గర్భం దాల్చడం ఎంతో ఉత్సాహంగా, గర్వంగా ఉంది. వివాహమైన పదేళ్ల తర్వాత మేం బిడ్డలను కనాలని అనుకున్నాం. ఎందుకంటే ఇది సరైన సమయం. మేమిద్దరం (ఉపాసన-రామ్‌చరణ్‌) మా రంగాల్లో ఎదిగాం. ఆర్థికంగా బలోపేతమయ్యాం. మా పిల్లలకు కావాల్సినవన్నీ ఇచ్చే స్థాయికి చేరాం" అని ఉపాసన చెప్పుకొచ్చారు.

ప్రెగ్నెన్సీ ఆలస్యంపై కూడా ఉపాసన స్పందించారు. అది తమ ఇద్దరి నిర్ణయమని అన్నారు. ఈ విషయంలో అటు సమాజం, ఇటు కుటుంబం, బంధువుల ఒత్తిడికి తలొగ్గలేదని చెప్పారు. ఇది తమ మధ్య ఉన్న బలమైన బంధాన్ని చెప్పడంతో పాటు, పిల్లల విషయంలో తమకున్న స్పష్టతకు నిదర్శనమని ఉపాసన తెలిపారు. రామ్‌చరణ్‌-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నట్లు గతేడాది డిసెంబరు 12న ఇరు కుటుంబాలు వెల్లడించాయి. తన డెలివరీ కూడా ఇండియాలోనే జరుగుతుందని ఉపాసన ఇప్పటికే స్పష్టతనిచ్చారు.

మరోవైపు, తాను బాడీ షేమింగ్‌ కూడా ఎదుర్కొన్నట్లు ఇటీవల ఉపాసన వెల్లడించారు. "చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ నన్ను ఏదో ఒక విషయంలో జడ్జ్‌ చేస్తూనే ఉండేవారు. సమాజంలో ఉన్న ప్రతిఒక్కరూ ఇలాంటివి ఎదుర్కొన్నవారే. శరీరాకృతి, బ్యాక్‌గ్రౌండ్‌.. ఇలా పలు విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటాం. పెళ్లైన కొత్తలో నేనూ బాడీ షేమింగ్‌ ఎదుర్కొన్నా. నేను అందంగా లేనని, బాగా లావుగా ఉన్నానని, డబ్బు కోసమే చరణ్‌ నన్ను పెళ్లి చేసుకున్నాడని మాట్లాడారు. ఇలాంటి విమర్శలు చేసిన వాళ్లను నేను నిందించాలనుకోవడం లేదు"

"ఎందుకంటే, వాళ్లకు నా గురించి ఏమీ తెలియదు. అందుకే వాళ్లు అలా మాట్లాడి ఉండొచ్చు. గడిచిన పదేళ్లలో వాళ్లకు నా గురించి తెలిసింది. దానివల్ల ఇప్పుడు వాళ్లకు నాపై అభిప్రాయం మారిపోయింది. విమర్శలను మనం తీసుకునే విధానంలో ఉంటుంది. ట్రోల్స్‌ వచ్చాయని నేను కుంగిపోలేదు. వాటిని జయించా. ఇప్పుడు నా విషయంలో నేను ఎంతో ఆనందంగా ఉన్నా. ఈ రోజు నేనొక ఛాంపియన్‌గా ఫీలవుతున్నా. ఎందుకంటే ఆ విమర్శలను ఎలా ఎదుర్కొన్నానో నాకు మాత్రమే తెలుసు. నేను మరింత ధైర్యవంతురాలినయ్యాను" అని ఉపాసన వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.