ETV Bharat / entertainment

షూటింగ్​లో హీరో నితిన్​కు గాయాలు - డాక్టర్లు ఏం చెప్పారంటే? - హీరో నితిన్​కు గాయాలు

Hero Nithin Injured : టాలీవుడ్​లో సరైన సక్సెస్​ లేక ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న హీరోల్లో నితిన్ ఒకరు. ప్రస్తుతం ఆయన 'తమ్ముడు' సినిమా షూటింగ్‌లో గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. అసలేం జరిగింది? ఇప్పుడెలా ఉందంటే?

షూటింగ్​లో హీరో నితిన్​కు గాయాలు - డాక్టర్లు ఏం చెప్పారంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2024, 9:34 AM IST

Updated : Jan 11, 2024, 10:43 AM IST

Hero Nithin Injured : టాలీవుడ్​లో సరైన సక్సెస్​ లేక ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న హీరోల్లో నితిన్ ఒకరు. ఇప్పుడాయన 'తమ్ముడు' సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్​ ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోందట. అక్కడ హీరో నితిన్‌పై కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. అయితే తాజాగా ఆయనకు షూటింగ్‌లో ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ భారీ యాక్షన్ సన్నివేశం చేస్తున్న సమయంలో నితిన్‌ గాయపడినట్లు కథనాలు వస్తున్నాయి. ఆయన చేతికి గాయమైనట్లు అంటున్నారు. గాయపడిన నితిన్‌ను వెంటనే రాజమండ్రిలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు, అక్కడ చికిత్స చేసిన వైద్యులు నితిన్​కు మూడు వారాలు విశ్రాంతి సూచించినట్లు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకుంటున్న అభిమానులు నితిన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

అందులో నిజం లేదు : సినిమా షూటింగ్‌లో నితిన్​ గాయపడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. భుజం నొప్పి కారణంగా నితిన్​ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వివరణ ఇచ్చాయి. దీంతో సంక్రాంతి వరకు షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఇంట్లో రెస్ట్‌ తీసుకుంటున్నారు.

ఇకపోతే నితిన్ చివరిసారిగా వెంకీ కుడుముల తెరకెక్కించిన 'భీష్మ' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఈ టాలెంటెడ్ హీరో ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయారు. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. అలా రీసెంట్​గా టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్​ బ్యూటీ శ్రీలీలతో కలిసి 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీమ్యాన్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకుల మెప్పును పొందలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో నితిన్​కు మరోసారి నిరాశే మిగిలింది.

Venu Sriram Nithin Movie : కాగా, వేణు శ్రీరామ్ - నితిన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'తమ్ముడు' సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ మధ్యే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఈ మూవీ షూటింగ్​ ఏ బ్రేకులు లేకుండా కొనసాగింది. కానీ ఇప్పుడు నితిన్​కు భుజం నొప్పి రావడం వల్ల షూటింగ్​ కాస్త ఆగినట్టైంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ గ్రాండ్​గా నిర్మిస్తున్నారు. సినిమాలో సప్తమీ గౌడ హీరోయిన్‌గా నటిస్తుండగా వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో నటిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మహేశ్​ గత 5 చిత్రాల వసూళ్లు - 'గుంటూరు కారం' బ్రేక్ చేస్తుందా?

సంక్రాంతి సినిమాల రన్​టైమ్​ - ఇందులో కూడా మహేశే టాప్​!

Last Updated : Jan 11, 2024, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.