Nikhil Karthikeya 2 postpone: అనుకున్నట్టే జరిగింది. సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న 'కార్తికేయ 2' వాయిదా పడింది. సాధారణంగా జులై 22న మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల పోస్ట్‌పోన్ చేసినట్లు హీరో నిఖిల్ మంగళవాం తెల్లవారుఝామున సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. ఆగస్టు మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని ప్రకటించారు. ప్రీమియర్ షో కోసం టికెట్లు బుక్ చేసుకున్న వారికి క్షమాపణలు చెప్పారు. వారి డబ్బులను తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు. మరి ఆగస్టు మొదటి వారంలో 'కార్తికేయ 2'విడుదలకు సిద్ధమైతే.. ఇప్పటికే ఆగస్టు 5న కళ్యాణ్ రామ్ 'బింబిసార', దుల్కర్ సల్మాన్ 'సీతారామం' రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకున్నాయి. అప్పుడీ మూడు చిత్రాలకు పోటీ తప్పదు.
ఇక 'కార్తికేయ 2' విషయానికొస్తే.. నిఖిల్- చందూ కాంబినేషన్‌లో 2014లో వచ్చిన 'కార్తికేయ' మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఫ్రాంచైజీగా రూపొందడంతో ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు చక్కని స్పందన వచ్చింది. సముద్రం దాచుకున్న ద్వారకా నగరం.. దాని వెనకున్న రహస్యాన్ని కనిపెట్టే కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు ఈ ప్రచార చిత్రం చూస్తే అర్థమైంది. ఇందులో చూపించే ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉంది. 'అసలు కృష్ణుడు ఏంటి?ఈ కథను ఆయనే నడిపించటం ఏంటి?' అంటూ నిఖిల్.. 'విశ్వం ఒక పూసల దండ. ప్రతిదీ నీకు సంబంధమే. ప్రతిదీ నీ మీద ప్రభావమే' అంటూ అనుపమ్ ఖేర్ చెబుతున్న సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.
కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి. జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలకాబోతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: పెళ్లి రోజు డ్రింక్ చేయడం వల్లే.. ఆ పని చేయలేకపోయాం: రాధికా ఆప్టే