ETV Bharat / entertainment

'ఈగ'లో నానికి రాజమౌళి అందుకే ఛాన్స్ ఇచ్చారంట!

సిల్వర్​ స్క్రీన్​కి రాజమౌళిని మించిన బ్రాండ్​ అంబాసిడర్​ ఎవరూ లేరని నేచురల్​ స్టార్​ హీరో నాని అన్నారు. మాస్​, క్లాస్ ఆడియెన్స్​ల పల్స్​ పట్టడంలో ఆయనకు సాటి ఎవరూ రారని జక్కన్నను కొనియాడారు. ఇంకా ఏమన్నారంటే..

hero nani praised rajamouli as brand ambassador
దర్శకుడు రాజమౌళిని పొగిడిన హీరో నాని
author img

By

Published : Mar 29, 2023, 9:58 PM IST

Updated : Mar 29, 2023, 10:12 PM IST

'ఆర్​ఆర్​ఆర్'​ దర్శకుడు రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తారు నేచురల్​ స్టార్​ హీరో నాని. సిల్వర్​ స్క్రీన్​కి రాజమౌళిని మించిన బ్రాండ్​ అంబాసిడర్​ ఎవరూ లేరని ఆయన అన్నారు. మాస్​ లేదా క్లాస్​ ప్రేక్షకుల పల్స్​ పట్టడంలో జక్కన్న ఆలోచన తీరు అద్భుతంగా ఉంటుందని కొనియాడారు. ఆర్​ఆర్​ఆర్​ విజయంతో రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని అన్నారు. ఇండియన్​ సినిమా ఖండాంతరాలు దాటించి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేసిన రాజమౌళికి బిగ్​ స్క్రీన్​ మొత్తం ధన్యవాదాలు చెప్పిన తప్పులేదని పేర్కొన్నారు. ఎందుకంటే ఆయన సినిమాలు చేసేటప్పుడు ఎక్కువగా బ్రాడ్​ మైండ్​ను కలిగి ఉంటారని అన్నారు. అలాగే 2012లో తెలుగు, తమిళం, హిందీలో వచ్చిన ఈగ సినిమాలో రాజమౌళితో కలిసి పని చేసిన క్షణాలను గుర్తు చేసుకున్నారు.

"నేను ఈగ సినిమా చేసే కన్నా ముందు ఐదు సినిమాల్లో నటించాను. అప్పటికే నటుడిగా నా సామర్థ్యాన్ని గుర్తించారు రాజమౌళి. అందుకే భారీ ప్రాజెక్ట్​ అయిన ఈగలో అవకాశం కల్పించారు. నా యాక్టింగ్​ నచ్చినందువల్లే రాజమౌళి సుమారు రెండున్నర గంటల సినిమాలో 40 నిమిషాలు నటించేందుకు నాకు ఛాన్స్​ ఇచ్చారు. నన్ను పాన్ ఇండియా స్టార్​గా నిలిపిన చిత్రమిదే. ఈ సినిమా వల్ల తెలుగు రాష్టాలతో పాటు వివిధ ప్రాంతాల వారికి కూడా నేను మరింత దగ్గరయ్యాను. రాజమౌళితో నా అనుభందం ఈ చిత్రంతోనే మొదలైంది. ఆయనకు ధన్యవాదాలు"

- హీరో నాని.

ఆర్​ఆర్​ఆర్​కు ఆస్కార్​.. ఇకపోతే 'ఆర్​ఆర్​ఆర్​'లోని 'నాటు నాటు' సాంగ్​కు.. కొద్ది రోజుల ముందే ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్​ వరించింది. దీంతో ఆస్కార్​ను గెలిచిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది 'ఆర్​ఆర్​ఆర్'. గతేడాది 2022లో విడుదలైన ఈ సినిమాలో దేశ విప్లవకారులైన అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్​ చరణ్​, కొమరం భీమ్​ క్యారెక్టర్​లో జూ.ఎన్టీఆర్​ నటించారు. ఈ సినిమా ప్రపంచం వ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లతో బాక్సాఫీస్​ వద్ద సునామీ సృష్టించింది.

కాగా, నాని 'దసరా' సినిమాతో మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. తెలంగాణ పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి బొగ్గు గనులలో ఉన్న ఓ గ్రామీణ నేపథ్యంలో రూపొందింది ఈ చిత్రం.

Last Updated : Mar 29, 2023, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.