ETV Bharat / entertainment

విజయ్ 'లియో'లో కమల్ హాసన్.. లోకేశ్​ కనగరాజ్ కొత్త ప్లాన్​!

author img

By

Published : Jun 8, 2023, 10:15 PM IST

Leo Movie Vijay Thalapathy : తమిళ్​ స్టార్​ హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా 'లియో' నుంచి గ్లింప్స్ వీడియోను బర్త్​డే గిప్ట్​గా ఇవ్వాలని చూస్తోందట చిత్ర బృందం. అయితే ఆ వీడియో ఇప్పటికే రెడీ అయిందట. స్టార్​ హీరో కమల్​ హాసన్​.. ఆ వీడియోకు వాయిస్​ ఓవర్​ ఇచ్చినట్లు సమాచారం.

hero kamal-haasan-in-vijay-leo movie
hero kamal-haasan-in-vijay-leo movie

Leo Movie Vijay Thalapathy : తమిళ స్టార్ నటుడు విజయ్​కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నెల 22వ తేదీన దళపతి విజయ్ పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి. ఈ బర్త్​డే వేడుకల సందర్భంగా 'లియో'కు సంబంధించిన ఫస్ట్ లుక్, పోస్టర్​ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. దీంతో విజయ్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారట.

లియో నుంచి స్పెషల్ వీడియో..
Leo Movie Glimpse : విజయ్ ప్రస్తుతం దర్శకుడు లోకేశ్​ కనగరాజ్​తో 'లియో' సినిమా చేస్తున్నారు. గతంలో విజయ్​తో లోకేశ్​ 'మాస్టర్' సినిమాను తీశారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబోలో 'లియో' సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్​కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా 'లియో' నుంచి గ్లింప్స్ వీడియోను చేసి విజయ్​కు బర్త్​డే గిఫ్ట్​గా ఇవ్వాలని చూస్తోందట చిత్ర బృందం. ఇప్పటికే లోకేశ్​, అనిరుధ్ చెన్నైలోని ఓ మేజర్ స్టూడియోలో ఈ వీడియోను షూటింగ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ గ్లింప్స్ వీడియోకు స్టార్ నటుడు కమల్ హాసన్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు సమాచారం.

లియోలో కమల్ హాసన్?
Leo Movie Kamal Hassan : లోకేశ్ కనగరాజ్ విక్రమ్ సినిమాతో కొత్త యూనివర్స్​ను క్రియేట్ చేశారు. 'ఖైదీ', 'విక్రమ్' సినిమాలు చూస్తే అర్థమవుతోంది. ఇప్పుడు విజయ్​తో తెరకెక్కిస్తున్న 'లియో' కూడా ఈ యూనివర్స్​లో భాగమేనని అనుకుంటున్నారు. ఎందుకంటే 'ఖైదీ', 'విక్రమ్' సినిమాలలో నటించిన నటులతోనే మిగిలిన సినిమాలు కూడా చేస్తామని గతంలో చెప్పారు లోకేశ్​. ఇప్పటికే 'ఖైదీ' సినిమాలో నటించిన నటులు 'విక్రమ్'​లో అదే పాత్రల్లో కనిపించారు. ఇప్పుడు విజయ్ బర్త్​డేకు 'లియో' నుంచి రిలీజ్ చేసే గ్లింప్స్ వీడియోలో కమల్ హాసన్ వాయిస్ అందిస్తున్నారని తెలిసింది. దీంతో మూవీలో కమల్ హాసన్ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి.

విజయ్​- త్రిష.. 15 ఏళ్ల తర్వాత
Leo Movie Cast : ఇక ఈ మూవీలో విజయ్ సరసన త్రిష నటించనుంది. మధ్యలో త్రిష ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని వార్తలు వచ్చినా అవి వాస్తవం కాదని ప్రకటించింది చిత్ర బృందం. దాదాపు 15 ఏళ్ల తర్వాత విజయ్​తో కలసి నటిస్తోంది త్రిష. మరి ఈ మూవీతో లోకేశ్​ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సంజయ్ దత్, అర్జున్, మిస్కిన్, శాండీ, జోజు జార్జ్, ప్రియా ఆనంద్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను ఎస్.ఎస్ లలిత్ కుమార్, జగదీశ్​ పళనిస్వామి నిర్మిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.