ETV Bharat / entertainment

హరిహర వీరమల్లు..  పవన్ కొత్త​ స్టిల్స్​ చూశారా?

పవన్‌కల్యాణ్‌ 'హరి హర వీరమల్లు' షూటింగ్​ సెట్​లోని పవన్​కు సంబంధించిన కొత్త ఫొటోస్​ను పోస్ట్​ చేసింది మూవీటీమ్​. ఆ ఫొటోస్​ మీకోసం..

Hari hara veeramallu producer MM ratnam birthday
హరిహర వీరమల్లు
author img

By

Published : Feb 4, 2023, 10:54 AM IST

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్​ చిత్రం 'హరి హర వీరమల్లు'. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. పవన్‌కల్యాణ్‌కి జోడీగా నిధి అగర్వాల్‌ నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పిస్తున్నారు. నేడు ఎ. ఎం. రత్నం పుట్టినరోజు. ఈ సందర్భంగా మూవీటీమ్​ ఆయనకు స్పెషల్​ విషెస్​ తెలుపుతూ.. సెట్స్​లో పవన్​తో కలిసి ఆయన దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో వీరిద్దరూ సరదాగా నవ్వుకుంటూ కనిపించారు.

Happy birthday Hari hara veeramallu producer MM ratnam photos
హరిహర వీరమల్లు

ఇక ఎ.ఎం.రత్నం విషయానికొస్తే.. మేక‌ప్ మెన్​గా కెరీర్ ప్రారంభించి.. ఆ త‌ర్వాత నిర్మాత‌గా మారారు. సూర్యామూవీస్ బ్యానర్​పై ఆయన నిర్మించిన చిత్రాలు, అనువదించిన సినిమాలు టాలీవుడ్​ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. బాల్యం నుంచే సినిమాలంటే ఆసక్తి ఉండటంతో మద్రసు చేరుకున్న ఆయన మొదట హీరోయిన్ విజయ శాంతి నటిస్తున్న సినిమాకు మేకప్​ మెన్​గా పనిచేశారు. ఆ తర్వాత విజయశాంతి దగ్గరే పనిచేశారు. ఆమె ప్రోత్సాహంతో ఆయన కూడా ఓ నిర్మాతగా ఎదిగారు! తొలి ప్రయత్నంగా మోహన్ గాంధీ దర్శకత్వంలో రూపొందించిన కర్తవ్యం అనూహ్య విజయం సాధించింది. విజయశాంతిని జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిపింది. అనంతరం స్వీయ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా ధర్మయుద్ధం అనే చిత్రాన్ని తీయగా అది కూడా హిట్​గా నిలిచింది.

అనంతరం పెద్దరికం, సంకల్పం, స్నేహం కోసం, ఖుషి, నాగ, నీ మనసు నాకు తెలుసు, బంగారం, ఆక్సిజన్ వంటి ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఆయన అనవాదించిన తమిళ చిత్రాలు జెంటిల్ మేన్, ప్రేమికుడు, ప్రేమ‌లేఖ‌ వంటి మూవీస్​ కూడా తెలుగులో సూపర్​హిట్​గా నిలిచాయి. ఇక శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్ హాస‌న్​తో ర‌త్నం నిర్మించిన భార‌తీయుడు అనూహ్య విజ‌యం సాధించింది. దాంతో ఆయన దశ మరింత తిరిగిపోయింది. అలా అప్పటినుంచి అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ సినిమాలు తీస్తూ సక్సెస్​లతో ప్రయాణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు. తన పెద్ద కుమారుడిని జ్యోతికృష్ణను 'నీ మ‌న‌సు నాకు తెలుసు'తో ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం చేశారు. రెండో అబ్బాయి ర‌వికృష్ణను 7 జి బృందావ‌న్ కాల‌నీతో న‌టుడిగా ఇంట్రడ్యూస్​ చేశారు. కానీ ఆ త‌ర్వాత త‌న కుమారులుతో ఆయన చేసిన సినిమాలు డిజాస్ట‌ర్ కావ‌డంతో ఆర్థికంగా న‌ష్ట‌పోయారని తెలిసింది. మరి ప్రస్తుతం ఆయన చేస్తున్న హరిహర వీరమల్లు ఏ మాత్రం వరకు ఆయనకు హిట్ అందిస్తుందో చూడాలి.

ఇదీ చూడండి: పాకిస్థాన్​లో అక్రమంగా పఠాన్​ స్క్రీనింగ్​.. రూ.700కోట్ల కలెక్షన్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.