ETV Bharat / entertainment

'హనుమాన్' సినిమాపై హీరోయిన్ సమంత రివ్యూ - హనుమాన్ సమంత రివ్యూ

Hanuman Samantha Review : 'హనుమాన్‌' సినిమాపై హీరోయిన్ సమంత తన రివ్యూను ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏమని చెప్పిందంటే?

'హనుమాన్' సినిమాపై సమంత రివ్యూ
'హనుమాన్' సినిమాపై సమంత రివ్యూ
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2024, 6:58 PM IST

Hanuman Samantha Review : తక్కువ అంచనాలతో చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్​ హిట్​ టాక్​ను దక్కించుకుంది 'హనుమాన్‌' సినిమా. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులు, సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలతో పాటు వసూళ్లను అందుకుంటూ పోతోంది. అయితే తాజాగా ఇప్పుడు స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాపై తన రివ్యూను పోస్ట్‌ చేసింది.

మనల్ని మళ్లీ బాల్యంలోకి తీసుకెళ్లే చిత్రాలు ఉత్తమమైనవి. హనుమాన్​ చిత్రంలో ప్రతి అంశం నన్ను బాగా ఆకట్టుకుంది. విజువల్స్, కామెడీ, మ్యూజిక్​ ఇలా ఎన్నో అద్భుతమైన అంశాలతో సిల్వర్​ స్క్రీన్​పై హనుమంతుడు చేసిన మ్యాజిక్‌ చేశారు. ఇంత గొప్ప చిత్రాన్ని తీసిన ప్రశాంత్‌ వర్మకు ధన్యవాదాలు. ఈ మూవీ సీక్వెల్‌ కోసం ఎంతో ఇంట్రెస్టింగ్​గా ఎదురుచూస్తున్నాను. తేజ సజ్జా తన యాక్టింగ్​తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. హనుమంతు పాత్ర ఈ సినిమాకు హార్ట్‌. వీఎఫ్ఎక్స్‌ ఎఫెక్ట్స్​ సినిమాకు మరింత అందాన్నిచ్చాయి" అంటూ మూవీ టీమ్​కు సామ్​ అభినందనలు తెలిపింది.

Kishan Reddy Tejasajja : ఇకపోతే తాజాగా తేజ సజ్జాను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన నివాసంలో సత్కరించారు. ప్రతి టికెట్‌ నుంచి అయోధ్య రామమందిరానికి రూ.5 విరాళంగా ఇవ్వడం అభినందనీయమని అన్నారు. కాగా, ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్​లో వచ్చిన ఈ సినిమా జనవరి 12న రిలీజై భారీ వసూళ్లను దక్కించుకుంది. ఇప్పటి వరకు వరల్డ్​ వైడ్​గా రూ.100 కోట్లకు(Hanuman Movie collections) పైగా వసూళ్లను తన ఖాతాలో వేసుకుంది.

సూపర్‌ హీరో స్టోరీకి ఇతిహాసంతో ముడిపెట్టి నేటివిటీ మిస్‌ కాకుండా దర్శకుడు ప్రశాంత్​ వర్మ అద్భుతంగా చూపించారు. అంజ‌నాద్రి అనే ఫిక్ష‌న‌ల్ గ్రామం బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కించారు. చిత్రంలో అమృత అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కీలక పాత్ర పోషించగా కోలీవుడ్ న‌టుడు విన‌య్ రాయ్ విల‌న్‌గా క‌నిపించారు. ఇక ఈ హ‌నుమాన్‌కు జై హ‌నుమాన్ పేరుతో సీక్వెల్ త్వరలోనే రానుంది.

Hanuman Samantha
'హనుమాన్' సినిమాపై సమంత రివ్యూ

'సంస్కృతిని ఎప్పుడూ తప్పుగా చూపించను - వాళ్ల గురించి నేను మాట్లాడను'

సంక్రాంతి బరిలో సౌత్​ సినిమాలు - కలెక్షన్స్​లో టాప్​ ఏదంటే ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.