Hanuman Premieres : పెద్ద పెద్ద స్టార్లు నటించలేదు - దర్శకుడు కూడా పెద్దగా పేరున్నోడు కాదు - అయినప్పటికీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చాలా ట్రెండ్ అవుతున్న సినిమా 'హనుమాన్'. ఆరంభం నుంచే ఈ చిత్రం అంచనాలను పెంచేసుకుని నెట్టింట్లో సెన్సేషన్ అవుతోంది. అలా భారీ హైప్‌తో ఈ సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ఓ అరుదైన రికార్డును నమోదు చేసుకుంది. ఓ హాలీవుడ్ మూవీ రికార్డుకు చేరువగా వచ్చిన తొలి తెలుగు సినిమాగా రికార్డు సాధించింది.
వివరాళ్లోకి వెళితే. సూపర్ హీరో కాన్సెప్టుతో తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన మూవీ 'హనుమాన్'. ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా, వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. అనుదీప్ దేవ్, హరి గౌర, జయ్ క్రిష్, కృష్ణ సౌరభ్‌లు సంగీత దర్శకులుగా పని చేశారు.
ఇప్పుడీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోకు బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. జనవరి 12న(Hanuman Release Date) సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా 11వ తేదీ పెయిడ్ ప్రీమియర్స్‌ను ప్లాన్ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలోని పలు ప్రధాన నగరాల్లోనూ షోలు వేయనున్నారు. ఇలా మొత్తంగా నేడు(జనవరి 11) 330 షోల వరకూ పడబోతున్నాయి.
-
#Hanuman - 89 shows and counting for Premieres in Bengaluru City. All time 2nd highest premiere show count in Bengaluru alone after #JohnWick4
— Karnataka Talkies (@KA_Talkies) January 10, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Hanuman - 89 shows and counting for Premieres in Bengaluru City. All time 2nd highest premiere show count in Bengaluru alone after #JohnWick4
— Karnataka Talkies (@KA_Talkies) January 10, 2024#Hanuman - 89 shows and counting for Premieres in Bengaluru City. All time 2nd highest premiere show count in Bengaluru alone after #JohnWick4
— Karnataka Talkies (@KA_Talkies) January 10, 2024
బెంగళూరులో భారీగా : అలా బెంగళూరులోనూ భారీగా ప్రీమియర్స్‌కు ప్లాన్ చేశారు. అక్కడి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అక్కడ నేడు సాయంత్రం 89 షోలు ప్రదర్శితం కాబోతున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు అక్కడ హాలీవుడ్ మూవీ 'జాన్ విక్ 4' అత్యధికంగా 135కు పైగా ప్రీమియర్ షోలు ప్రదర్శితం అయింది. ఇప్పుడా రికార్డుకు చేరువగా బెంగళూరులో అత్యధిక పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శితం అవుతున్న రెండో సినిమాగా రికార్డు నెలకొల్పింది. అలానే అత్యధిక పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శితం అవుతున్న తొలి తెలుగు సినిమాగానూ రికార్డు అందుకుంది. దీంతో కర్నాటక వ్యాప్తంగా 'హనుమాన్' సినిమా పేరు మారుమ్రోగిపోతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'హనుమాన్' ఫస్ట్ రివ్యూ - సినిమా గూస్బంప్స్!
'హనుమాన్' ప్రీమియర్ షోస్ టికెట్స్ - ఊహించని విధంగా మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్!
'హనుమాన్' కోసం 'అంజనాద్రి' - ఈ సినిమాలో ఎన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయంటే ?